Rasi Phalalu: ఖర్మ సమయాల్లో ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి..ఎందుకో తెలుసా?


Rasi Phalalu In Telugu: ఖర్మ సమయాల్లో తప్పకుండా కొన్ని రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు మానసిక సమస్యలు కూడా రావచ్చు. 

  • Dec 15, 2023, 14:36 PM IST

 

Rasi Phalalu 2023: హిందూ సాంప్రదాయంలో ఖర్మ సమయాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఖర్మ సమాయాలు డిసెంబర్ 16 నుంచి  జనవరి 14 వరకు కొనసాగుతుంది. ఈ ఖర్మలలో సూర్య, శుక్ర, కుజ, బుధ, గురు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. డిసెంబర్ 16న సూర్యుడు, డిసెంబర్ 25న శుక్రుడు, డిసెంబర్ 27న కుజుడు, డిసెంబర్ 31న బృహస్పతి గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇలా సంచారం చేయడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఖర్మ మాసంలో ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

ఖర్మ సమయంలో మేష రాశివారికి సాధారణంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మానసిక సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మార్పులు కూడా రావచ్చు.   

2 /5

వృషభ రాశి ఖర్మ సమయంలో ఒడిదుడుకులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కార్యాలయంలోని పనుల్లో బిజీ అవుతారు. అలాగే శ్రమ కూడా పెరుగుతుంది. జీవనశైలిలో అనేక మార్పులు వచ్చి కొన్ని సమస్యలు వస్తాయి. 

3 /5

మిథున రాశివారు ఈ సమయంలో తప్పకుండా స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మేలు. అంతేకాకుండా కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి గందరగోళం పెరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి.   

4 /5

కర్మ సమయంలో కర్కాటక రాశివారికి మనసుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో విజయం సాధిస్తారు. అలాగే సమయంలో కూడా గౌరవం పెరుగుతుంది.   

5 /5

ఈ సమయంలో సింహ రాశివారు చాలా ఓపికతో ఉండడం చాలా మంచిది. కోపాన్ని నియంత్రించుకుంటే సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఆదాయం పెరుగి వస్తువులను కూడా కొనుగోలు చేస్తే ఛాన్స్‌లు ఉన్నాయి.