Prabhas Anushka Shetty Engagement: టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ దే. మరోవైపు హీరోయిన్స్ లలో అనుష్క శెట్టి కూడా మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ గా సత్తా చూపెడుతుంది. ఇక తెరపై వీరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొన్నేళ్లగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Prabhas Anushka Shetty Engagement: గత కొన్నేళ్లు ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు మీడియా వీరిద్దిరికీ ఎన్నిసార్లు మ్యారేజ్ చేసిందో చెప్పడం కష్టమే. ఇక ప్రభాస్, అనుష్కలిద్దరు కూడా 40 ఏళ్లు పైబడే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ 45 యేళ్లు క్రాస్ అయ్యాయి. మరోవైపు అనుష్క శెట్టికి 43 యేళ్లున్నాయి. ఆల్రెడీ వీళ్లకన్నా వయసులో తక్కువగా ఉన్నా హీరో, హీరోయిన్స్ ఎంతో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు. కానీ వీళ్లిద్దరు మాత్రం స్టిల్ బ్యాచిలర్ లైఫ్ ను కంటిన్యూ చేస్తున్నారు.
అంతేకాదు తెరపై ఎంతో క్యూట్ గా కనిపించే ప్రభాస్, అనుష్కలు నిజ జీవితంలో మంచి స్నేహితులు. వీళ్లిద్దరు పలు సినిమాల్లో జోడిగా నటించి మెప్పించారు. వీళ్లిద్దు పెళ్లి చేసుకుంటే చూడాలనుకునే సినీ అభిమానులున్నారు.
అయితే కొన్ని పత్రికల కథనం ప్రకారం వీళ్లిద్దరు కొన్నేళ్లుగా గప్ చుప్ గా డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు వీరిద్దరు అభిప్రాయాలు కూడా కలిసాయి. దీంతో వీరు పెళ్లి చేసుకోవడమే తరువాయి అంటున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ పెద్దమ్మతో పాటు ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారు.
గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రభాస్, అనుష్క శెట్టిల నిశ్చితార్థానికి సంబంధించిన ఏఐ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజ జీవితంలో వీరు పెళ్లి చేసుకుంటారో లేదో కానీ.. అభిమానులు మాత్రం AI టెక్నాలజీతో ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్ చేసేసారు. త్వరలో పెళ్లి చేసినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
ప్రస్తుతం ప్రభాస్..ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మ సినిమాలకు ఓకే చెప్పారు. మరోవైపు అనుష్క త్వరలో కొత్త చిత్రంలో పలకరించబోతుంది.