Post Office Scheme: సూపర్ డూపర్ స్కీమ్.. రూ. 5లక్షలకు రూ. 15లక్షలు మీ సొంతం

Post Office Scheme:  మీరు పెట్టే ఇన్వెస్ట్ ఎంతైనా సరే.. దానిపై 3 రెట్ల రిటర్న్స్ వస్తాయంటే మీకు సంతోషమే కదా?  అందుకే ఇక్కడ అలాంటి బెస్ట్ స్కీం గురించి వివరాలు అందించాము.  ఈ స్కీమ్ లో మీరు రూ. 500000 పెట్టుబడి పెడితే రూ.15 లక్షల పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం .
 

1 /6

Post Office Scheme:  పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వారి తల్లిదండ్రులు శ్రమిస్తూ ఉంటారు. వారి అవసరాలు తీర్చడానికి.. ఆర్థికంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని తపన పడుతుంటారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, అవసరాల వల్ల సంపాదించిందంతా ప్రస్తుతం తీర్చడానికి సరిపోతుంది.  అయితే కొంచమైనా సేవింగ్స్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు ప్లాన్ చేయాలంటే.. మీరు ఇప్పుడే ఈ మంచి స్కీమ్ లో ఫిక్స్ డిపాజిట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ లో అలాంటి సూపర్ డూపర్ స్కీం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

2 /6

పిల్లలు పుట్టగానే కొంతమంది తల్లిదండ్రులు పి పి ఎఫ్, ఆర్ డి, సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీములలో పెట్టుబడి పెడుతుంటారు. మరి కొందరు పిల్లల భవిష్యత్తు కోసం ఫిక్స్ డిపాజిట్లు పెట్టుబడి పెడతారు. తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి నిచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీం లో 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే చివరిగా రూ. 15 లక్షల రూపాయలను మీ చేతికి అందుతాయి.  

3 /6

 మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ ఆర్డి మంచి ఆప్షన్.  ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ కి మంచి భరోసా ఉంటుంది. ఇందులో ఐదేళ్లు ఎఫ్డి పై మంచి రాబడి కూడా వస్తుంది. బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీరేట్లు ఇందులో ఉంటాయి. ఈ స్కీం ద్వారా మీరు ఐదు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 180  నెలల్లో రూ.15 లక్షల రూపాయలను పొందవచ్చు.  

4 /6

 ఐదు లక్షల 15 లక్షలు గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా అవ్వాలంటే మీరేం చేయాలో తెలుసుకుందాం. ఐదు లక్షలు ఐదు సంవత్సరాలు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయండి. 7.5% వడ్డీ అందిస్తుంది. ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం ఏడు లక్షల 24 వేల 974 అవుతుంది. ఈ మొత్తానికి తిరిగి మరో ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి. ఈ విధంగా 10 ఏళ్లలో  ఐదు లక్షల పై వడ్డీ రూ. 5,51,75  అవుతుంది. ఇలా మొత్తం రూ.10,51,175 అవుతుంది.  

5 /6

రూ.10,51,175 ఈ మొత్తాన్ని మళ్లీ ఐదేళ్లకు ఇన్వెస్ట్ చేయండి. అంటే మొత్తం 15 ఏళ్లు మీ డబ్బును పెట్టుబడిగానే ఉంటుంది. 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ అయినప్పుడు 5 లక్షల పెట్టుబడి పై వడ్డీ రేటు రూ.10,24,149 అవుతుంది. మొత్తం 15 ఏళ్లకు .15,24,149 మీ చేతికి అందుతాయి.   

6 /6

అలాగే బ్యాంకు లాగే పోస్ట్ ఆఫీస్ లో కూడా పలు టెన్యూర్ ఎఫ్డీలు ఉన్నాయి. ప్రతి కాలానికి వేర్వేరు వడ్డీరేట్లు ఉంటాయి. ప్రస్తుత వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. 1 సంవత్సరం: 6.9%, 2 సంవత్సరాలు: 7.0%, 3 సంవత్సరాలు: 7.1%, 5 సంవత్సరాలు: 7.5%