Redmi K80 Series: డబ్బు రెడీ చేసుకోండి.. చీప్‌ ధరలోనే 6500mAh బ్యాటరీ, వాటర్‌ ప్రూఫ్ Redmi K80 మొబైల్‌ రాబోతోంది!

Redmi K80 Series Launch Here Expected Features, Specifications: ప్రముఖ టెక్‌ కంపెనీ Xiaomi మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ గతంలోనే వెల్లడించింది. దీనిని కంపెనీ  Redmi Note 14 ప్రో సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే Redmi K80 సిరీస్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు రెడ్‌మీ వెల్లడించింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. 

1 /7

ఇటీవలే Redmi K80 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిని కంపెనీ నవంబర్‌ లేదా డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ జంబో బ్యాటరీ సెటప్‌తో తీసుకు రానుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

2 /7

 Redmi K80 స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వనిల్లా వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా సిరీస్‌లో ప్రో మోడల్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వాటర్‌ ఫ్రూఫ్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది.    

3 /7

ఈ Redmi K80 సిరీస్‌ అద్భుతమైన టెలిఫోటో కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మెరుగైన జూమ్ సామర్థ్యాన్ని అందిస్తున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. అలాగే ఫోటోస్‌ పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది.   

4 /7

రెడ్ మీ కంపెనీ గతంలో విడుదల చేసిన Redmi K70తో పాటు Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్స్‌కి ఎలాంటి  వాటర్‌ప్రూఫ్ సామర్థ్యాలను అందించకపోయి.. ఈ వేరియంట్‌లో మాత్రం తీసుకు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది IP68 లేదా IP69 రేటింగ్‌ సామర్థ్యంలో వస్తోంది.   

5 /7

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలో మాక్రో షాట్‌ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా చిన్న సబ్జెక్ట్‌ను కూడా సులభంగా క్యాప్చర్‌ చేయవచ్చు. అలాగే కెమెరాలో ఇవే కాకుండా అనేక ఆప్డేట్‌లను అందిస్తోంది.   

6 /7

ఇక Redmi K80 స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 6500mAh జంబో సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా త్వరలోనే లాంచ్‌ కాబోయే Redmi Note 14 Pro+ మొబైల్‌ కూడా శక్తివంతమైన 6200mAh సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

7 /7

ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2K OLED ప్యానెల్‌ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. ఇంకా ఈ సిరీస్‌కి సంబంధించిన ధరలను కంపెనీ వెల్లడించలేదు.