Cyclone Remal Pics: పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం రేపీన రెమాల్ తుపాను, దృశ్యాలివిగో

రెమాల్ తుపాను నిన్న అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, భారీ ఈదురుగాలులతో పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం నెలకొంది. వేలాదిమంది నిరాశ్రయులు కాగా ఇద్దరు మృతి చెందారు. వందలాది చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. వందల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాలు మీ కోసం..

Cyclone Remal Pics: రెమాల్ తుపాను నిన్న అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, భారీ ఈదురుగాలులతో పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం నెలకొంది. వేలాదిమంది నిరాశ్రయులు కాగా ఇద్దరు మృతి చెందారు. వందలాది చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. వందల కొద్దీ ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాలు మీ కోసం..

1 /11

రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇద్దరు మృతకి చెందారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పెను బీభత్సం రేగింది.

2 /11

సెంట్రల్ కోల్‌కతాలోని ఏంటలీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు

3 /11

సుందర్‌బన్ డెల్టాకు ఆనుకుని ఉన్న మౌసునీ ద్వీపంలో ఓ చెట్టు పూరిళ్లుపై పడి ఓ మహిళ మరణించింది. 

4 /11

రెమాల్ తుపాను పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా మధ్య తీరం దాటింది. ఆ సమయంలో ఈ ప్రాంతంలో భారీ బీభత్సం రేగింది. వందలాది చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.

5 /11

రాష్ట్రంలో దాదాపుగా 15 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయని సమాచారం. 24 జిల్లాల్లో, 79 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం కన్పించింది. 

6 /11

కోల్‌కతాలోని చాలా ప్రాంతాల్లో భారీవర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. సియాల్‌దహ్ టెర్మినల్ స్టేషన్ నుంచి సబ్ మెట్రో ట్రైన్ సేవలు నిలిపివేశారు. దాంతో ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 

7 /11

కోల్‌కతా సహా ఇతర తీర ప్రాంతాల్లో చిన్న చిన్న పూరిళ్ల కప్పులు ఎగిరిపోయాయి. కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు పడిపోయాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 

8 /11

రాష్ట్రంలో దాదాపుగా 15 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయని సమాచారం. 24 జిల్లాల్లో, 79 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం కన్పించింది. 

9 /11

రాష్ట్రం మొత్తంలో 2140 చెట్లు, 337 విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. కనీసం 14, 941 ఇళ్లు నేలకూలాయి. దాంతో 14 వేలమంది నిరాశ్రయులయ్యారు. 

10 /11

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కాకద్వీపం, సాగర్ ద్వీపం, డైమండ్ హార్బర్, ఫ్రేజర్‌గంజ్, బక్ఖాలీ, మందారమణి ఉన్నాయి. 

11 /11

రెమాల్ తుపాను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 7 వేల 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం శిబిరాల్లో 778 వేలమంది ఉన్నారు.