Sai Pallavi: సాయి పల్లవి ఫస్ట్ క్రష్ ఆ హీరోనా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు.. !

Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి గురించి అభిమానులకు కొత్తగా పరిచయలు అక్కర్లేదు. ఫ్యాన్స్ కు  లేడీ ప‌వ‌ర్ స్టార్. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినీ రంగంలో మేకప్ లేకుండా నాచురల్ బ్యూటీ రాణిస్తోన్న ఏకైక హీరోయిన్ గా సాయి పల్లవికి తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ గురించి  ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

1 /7

సాయి పల్లవి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే అందాల ప్రపంచం. అలాంటి ఇండస్ట్రీలో తనదైన శైలిలో తన మార్క్ నటనతో  దూసుకుపోతుంది.

2 /7

అంతేకాదు సాయి పల్లవి మొదటి నుంచి విభిన్న కథా చిత్రాలతో ఆమె కంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’ మూవీతో పరిచయమైంది.  అంతేకాదు హీరోయిన్ గా అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు అని చెప్పింది.

3 /7

ప్రేమమ్ మూవీ కంటే ముందు ‘కస్తూరి మాన్’, ధూమ్ ధామ్’ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాను. అందులో జయం రవి, కంగనా రనౌత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాలో నటిస్తున్న సమయంలో చాలా కంగారు పడిన విషయాన్ని ప్రస్తావించారు.

4 /7

తెలుగులో సాయి పల్లవి ఫస్ట్ మూవీ ‘ఫిదా’.అక్కడ నుంచి ఈమె యాక్ట్ చేసే ప్రతి సినిమాలో హీరో ఎవరున్నా.. కథానాయికగా సాయి పల్లవి డామినేషన్ మాత్రం కనిపిస్తూనే ఉంది. ఫిదాలో ఆత్మాభిమానం ఉన్న యువతి పాత్రలో నటిస్తే.. విరాట పర్వంలో ఒక నక్సలైట్ ను ప్రేమించే యువతి పాత్రలో ఒదిగిపోయింది. 

5 /7

సాయి పల్లవి డ్యాన్స్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సాయి పల్లవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సాయి పల్లవి మామూలు పాత్రలకు దూరంగా ఉంటుంది.

6 /7

ఇక హీరోయిన్ కాకముందు సాయి పల్లవికి హీరో సూర్య అంటే ఫస్ట్ క్రష్ అని చెప్పింది. చాలా తక్కువ సమయంలో సూర్యతో ‘ఎన్జీకే’ సినిమాలో కలిసి నటించాడాన్ని ఇప్పటికీ మరిచిపోలేనని చెబుతోంది.

7 /7

సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ మూవీలో కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ‘రామాయణం’ మూవీలో సీత పాత్రలో నటిస్తోంది.