Samantha: సమంత ఏం తింటుందో తెలుసా.. అందుకే బరువు పెరగదంట..!

Samantha Fitness secret: స్టార్ బ్యూటీ సమంత తన హెల్త్ కేర్ గురించిన సీక్రెట్ లు..బయట పెట్టేసింది. యానిమల్ ప్రోటీన్ కంటే ప్లాంట్ బేస్డ్ డైట్ లో.. నుంచే తను ప్రతిరోజు కావాల్సిన పోషకాలను అందుకుంటున్నాను అంటూ.. సమంత చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగా తన వీక్నెస్ లు కూడా చెప్పేసింది సమంత.

1 /5

స్టార్ బ్యూటీ సమంత గురించి.. తెలియని వారు ఉండరు. అందంతో మాత్రమే కాక.. నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షించే సమంత.. ఇంత అందంగా ఉండడానికి కారణం ఆమె తీసుకుని ఆరోగ్యకరమైన ఆహారం అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. 

2 /5

అయితే ఆమె ఎటువంటి ఆహారం తీసుకుంటుంది.. ప్రతిరోజు ఆమె ఏం తింటుంది.. ఆమె హెల్త్ కేర్ ఎలా ఉంటుంది.. అనే విషయాల గురించి చాలానే ప్రశ్నలు ఎదురయ్యాయి 

3 /5

తాజాగా సమంత ఒక వీడియోతో ఆ ప్రశ్నలు అన్నిటికీ.. జవాబు ఇచ్చేసింది. ఒక తన హెల్త్ కేర్ గురించి తన డైట్ గురించి.. బోలెడు సీక్రెట్స్ బయట పెట్టింది సమంత. "నా డైట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందరూ మనకి కావాల్సిన ఐరన్, కాల్షియం వంటివి ప్లాంట్ బేస్డ్ డైట్ తో.. రావు అని అంటూ ఉంటారు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నేను ఆ డైట్ తోనే కావాల్సిన పోషకాలను అందుకుంటున్నాను. నేను తినే వాటిలో ముందు ఉండేది ఫ్రూట్స్. చాక్లెట్స్ నా వీక్నెస్" అంటుకు తన ఫ్రిజ్లో ఉన్న బోలెడు ఫ్రూట్స్ చాక్లెట్స్ ను చూపించింది సామ్.   

4 /5

"ఇవి ఇంట్లో చేసిన పచ్చళ్ళు. సౌత్ ఇండియాలో అందరి ఇళ్లల్లోనూ పచ్చళ్ళు ఉంటాయి. ప్రతిరోజు ఇడ్లీ సాంబార్ చట్నీ మస్ట్. నాన్ వెజిటేరియన్ ఫుడ్ నుంచి పూర్తిగా ప్లాంట్ బేస్డ్ డైట్ లోకి మారడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అది నాలో భాగం అయిపోయింది. ఇప్పుడు చాలా లైట్ గా.. ఎనర్జిటిక్ గా.. హ్యాపీగా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చింది సమంత.  

5 /5

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన హెల్త్ సీక్రెట్.. వెజిటేరియన్ ఫుడ్ అని బయట పెట్టేసింది. ఇక సినిమాల పరంగా చూస్తే సమంత త్వరలోనే హిందీలో సిటాడల్…అనే వెబ్ సిరీస్ లో కనిపించనుంది. తెలుగులో కూడా స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉంది.