Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఎక్కువగా నీలిరంగు తలపాగ మాత్రమే ధరించే వారు... దీని వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా..?

Manmohan singh death: భారత మాజీ ప్రధాని, సంస్కరణల పితామహుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఢిల్లీలోకి ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచారు.
 

1 /7

భారత దేశంను తన ఆర్థిక సంస్కరణలతో ఒక దారిచూపిన ధీశాలి అస్తమించారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో 92 ఏళ్ల ప్రాయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన లేనీలోటు మాత్రం ఎవరు తీర్చలేనిదని చెప్పుకొవచ్చు.  కేంద్రం వారం రోజుల పాటు మన్మోహన్ సింగ్ ను గుర్తు చేసుకుంటూ సంతాపదినాలుగా ప్రకటించింది.

2 /7

రాజకీయాలకు అతీతంగా రాజనీతి దురంధరుడైన మన్మోహన్ సింగ్ కు ఘననివాళులు అర్పిస్తున్నారు. ఒక సామాన్యుడు.. అసామాన్యుడిగా ఎదిగిన వైనం ప్రతీ ఒక్క భారతీయుడికి ఆదర్శవంతమైందని చెబూతు ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు.

3 /7

అయితే.. మాజీ ప్రధాని ఎప్పుడు చూసిన కూడా తలమీద నీలంరంగు తలపాగను మాత్రమే ఎక్కువగా ధరించేవారు. దీని వెనక ఉన్న కారణాన్ని స్వయంగా ఆయనే వివరించినట్లు తెలుస్తొంది.  

4 /7

నీలి తలపాగా కథ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉందని తెలుస్తొంది. 2006లో మన్మోహన్ సింగ్.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ఆఫ్ లా పొందారు. అప్పటి ఎడిన్‌బర్గ్ డ్యూక్, అక్కడ ఉన్న యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రిన్స్ ఫిలిప్ ల దృష్టి ఆయన ధరించిన తలపాట మీద పడిందంట.  

5 /7

అది బాగుందని వాళ్లు ప్రశంసించారంట. అదే విధంగా.. అప్పటి నుంచి ఆయన బ్లూకలర్ టర్బన్ మాత్రమే అధికంగా ధరించేవారంట. అందుకే ఆయన మిత్రులు కూడా..  'బ్లూ టర్బన్' (బ్లూ టర్బన్) అని పిలిచేవారంట.  

6 /7

అందుకే ఆయన ఎప్పుడు చూసిన కేవలంలో నీలిరంగు టర్బన్ ను మాత్రమే అధికంగా ధరించేందుకు ప్రయారిటీ ఇచ్చేవారంట. అదే విధంగా తనకు ఇష్టమైన రంగు కూడా ఇదేనని మన్మోహన్ సింగ్ కూడా చెప్పారంట. అలాగే, నీలం రంగును కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క రంగుగా పరిగణిస్తారు.   

7 /7

కేంబ్రిడ్జ్‌లో గడిపిన రోజుల గురించి తనకు చాలా లోతైన జ్ఞాపకాలు ఉన్నాయని మన్మోహన్ సింగ్ అన్నారు. అందుకే.. యూనీవర్సీటీలోని అనుబంధం,  జ్ఞాపకాలు తనతో ఉండే విధంగా ఎల్లప్పుడు.. మన్మోహన్ సింగ్ నీలం రంగు టర్బన్ మాత్రమే  ధరించేవారంట.