Big Alert: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు సెలవు పొడిగింపు..?

School Holidays in AP: తెలుగు రాష్ట్రాల్లో అల్ప పీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో సోమవారం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా భారీ వర్షాల కారణంగా మరో రెండు రోజులు పాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

 

1 /5

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో భారీ వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గత రెండు రోజులుగా ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో వర్షాలు కురిసాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లో ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్ వాడీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో సెలవులను మరో రెండు పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.  

2 /5

ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. అంతేకాదు వరద ఉదృతి తగ్గిన తర్వాత ఇంకా నగరంలో సగ ప్రాంతం అంతా బురద లో  చిక్కుపోయింది. రాబోయే మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునారావాస చర్యల్లో భాగంగా ముందస్తుగా స్కూళ్లకు మరో రెండు రోజులు సెలవులు పొడిగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

3 /5

అంతేకాదు సహాయ పునరావాస కేంద్రాలను ఆయా జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలలో ఏర్పాట్లు చేయడంతో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు  సమాచారం.  వర్షాల నేపథ్యంలో కరెంటు, తాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ఇంట్లో ఏదైనా వండుకొని తిందా మంటే అన్ని నీటి పాలు కావడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

4 /5

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, కృష్ణా, పలనాడు, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో వరద ముంపు ఎక్కువగా ఉండటంతో ఈ ఎనిమిది జిల్లాల్లో సెలవులు ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

5 /5

ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం  ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు వరద బాధితులుకు  ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ చర్యలను చేపడుతున్నారు.