Milk Tea: రోజూ పాల టీ తాగుతున్నారా? ఇది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది తెలుసా?

Milk Tea Side effects: ప్రతిరోజూ ఉదయం టీ, కాఫీ లేనిదే ఎవరికీ సమయం గడవదు. అయితే, కరోనా తర్వాత చాలామందికి ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. దీనివల్ల టీ, కాఫీలకు బదులుగా హెర్బల్, గ్రీన్‌ టీలు తీసుకుంటున్నారు. అయితే, చాలామందికి ఇప్పటికీ ఉదయం పాలతో తయారు చేసిన టీ తాగనిదే వారికి గడవదు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం.
 

1 /6

మనం మన అమ్మమ్మల కాలం నుంచే పాలతో తయారు చేసిన టీ తాగే అలవాటు ఉంది. అయితే, మారుతున్న జీవనశైలి వల్ల కొన్ని ఆహారాలు మనం వదులుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఉదయం ప్రారంభించే టీ. దీన్ని ఎక్కువశాతం మంది పాలతో తయారు చేసిన టీ తీసుకుంటారు. ఏ కాస్త తలనొప్పి వచ్చినా టీ తాగుతారు.  

2 /6

ఏ కాస్త వర్క్‌ స్ట్రెస్‌ ఉన్నా టీ తాగుతారు, ఇంటికి చుట్టాలు వచ్చినా మన సంప్రదాయంలో టీ ఇచ్చే అలవాటు ఉంది. ఎందుకంటే ఈ టీ తాగడం వల్ల మూడ్‌ లిఫ్ట్‌ అవుతుంది కూడా. ముఖ్యంగా ఎక్కువ శాతం ఆఫీసుల్లో కూడా టీ కాపీలు తప్పనిసరి. కానీ, మనం తీసుకునే ఈ తేనీరు మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా?  

3 /6

ముఖ్యంగా మనం పాలతో తయారు చేసుకునే టీ నేరుగా ప్రభావం చూపకున్నా.. ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. గుండెలో మంట కలిగిస్తుంది. ఒక్కోసారి వికారం కూడా వస్తుంది. నిద్ర సమస్యల వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.  

4 /6

ఈ ప్రభావం ఎందుకంటే ఎక్కువ శాతం ఉదయం ఖాళీ కడుపున తీసుకుంటారు. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు కూడా తాగకూడదు. ఇది శరీరంలోని ఇతర పోషకాలకు కూడా అంతరాయం కలుగుతుంది.  

5 /6

ఉదయం మనం తీసుకునే టీలో కెఫీన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి వల్ల ఇతర వ్యాధులు వస్తాయి. అంతేకాదు మీకు అనారోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది.  

6 /6

ఖాళీ కడుపున మనం తీసుకునే టీ వల్ల రక్తపోటుకు కూడా దారితీయవచ్చు. ఇది ముఖ్యంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈరోజుల్లో చాలామంది బీపీ, షుగర్‌ బాధితులు ఉన్నారు. వీరు టీ తాగకుండా ఉండటమే మేలు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)