Shalini Pandey: షాలినీ పాండే తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఈ సినిమాలో ఈమె హాట్ ఇంటిమేట్ సీన్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా లో దుస్తుల్లో కనిపిస్తూ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినా షాలినీ పాండేకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలేవి సక్సెస్ కావపోవడంతో ఈమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది. ఎన్ని సినిమాలు చేసినా.. అర్జున్ రెడ్డి సినిమా దగ్గరే ఈమె ప్రయాణం ఆగిపోయింది.
అర్జున్ రెడ్డి తర్వాత తెలుగులో ‘మహానటి’, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించిన శాలిని పాండేకు పెద్దగా ప్రయోజనం ఏమి దక్కలేదు. ఈమె కెరీర్ కు పెద్దగా యూజ్ కాలేదు.
హిందీలో కూడా రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ‘జయేష్ భాయ్ జోర్దార్’ వంటి చిత్రంలో నటించిన పెద్దగా యూజ్ కాలేదు.అంతకు ముందు మేరి నిమ్మో, బంఫాద్, వంటి చిత్రాల్లో నటించింది.
రీసెంట్ గా ఈమె ఆమీర్ ఖాన్ కుమారుడు జునేద్ ఖాన్ హీరోగా పరిచయమైన ‘మహారాజ్’ చిత్రంలో కిషోరి పాత్రలో యాక్ట్ చేసింది. ఈ సినిమాలో కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన పెద్దగా యూజ్ కాలేదు.
మొత్తంగా షాలినీ పాండే ఎంత చేసినా.. అర్జున్ రెడ్డి అనే సినిమాతోనే ఈమె కెరీర్ ఎండ్ అయిందనే చెప్పాలి. అందుకే వీలైనపుడల్లా హాట్ ఫోట్ షూట్స్ లో రెచ్చిపోవడం షాలినీ పాండే స్టైల్. ప్రస్తుతం టెలివిజన్ తెరపై తన లక్ ను పరీక్షించుకుంటుంది.
షాలినీ పాండే 1990 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. మూవీస్ లోకి రాకముందు ఈమె థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.