Shani Dev Blessings: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి తిరిగి రావడానికి దాదాపు రెండున్నరేళ్ల పాటు సమయం పడుతుంది. శని గ్రహం 2023 సంవత్సరంలో శని సొంత రాశిగా పరిగణించే కుంభంలోకి ప్రవేశించింది.
ఈ గ్రహం జనవరి 2023 నుంచి వచ్చే ఏడాది వరకు కుంభ రాశిలో సంచార దశలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో తిరోగమన దశలో తిరగబోతున్నాడు. ఈ ప్రక్రియ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై నెరుగా ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా శని గ్రహం కుంభ రాశిలో తిరోగమనం చేయడం వల్ల దీపావళి తర్వాత కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
వృషభ రాశి వారి దీపావళి తర్వాత బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. దీంతో పాటు సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ప్రతి పనిలో శుభవార్తలు వింటారు.
మిథున రాశివారికి జీవితంలో సానుకూల ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మిథున రాశివారికి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా గతంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. వీరికి శని అనుగ్రహం లభించి విపరీతమైన లాభాలు కలుగుతాయి.
కుంభ రాశివారికి శని అనుగ్రహం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. అంతేకాకుండా గతంలో నిలిపోయిన పనులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.
మీన రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపార జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.