Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..

Shani Gochar: 2024 యేడాది మొత్తం శనిదేవుడు కుంభ రాశిలోని సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనిశ్వరుడు 100 రోజులు తర్వాత కుంభంలో వక్ర గమనం నుంచి తిరిగి  ప్రయాణించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశుల వారికీ అనుకోని అదృష్టం కలగబోతుంది. 

1 /5

Shani Transit: శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో వక్ర గమనంలో ప్రయాణిస్తున్నాడు. నవంబర్ మధ్యలో శని మళ్లీ తిరోగమనం నుంచి తిరిగి యదాతథా స్థితిలో రాబోతున్నాడు. ఇలా శని రాశి మార్పు  12 రాశులను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 13, 2024న శని గ్రహం తిరోగమనం నుండి  తన యథాప్రకారం ప్రయాణించనుంది.  దీంతో ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..

2 /5

మిథున రాశి: శని దేవుడు ప్రత్యక్ష సంచారం వలన మిథున రాశి వారికీ అద్భుత ప్రయోజనాలు కలగించనుంది. కెరీర్లో పురోగతి సాధిస్తారు. టెక్నికల్ అంశాలపై పట్టు సాధిస్తారు. మీరు పనిచేసే ప్రదేశంలో సహోద్యోగుల మద్ధతు పొందుతారు. సమాజంలో ప్రత్యేక గౌరవం, గుర్తింపు పొందుతారు.

3 /5

సింహ రాశి శని దేవుడు వక్రం నుంచి సక్రమ దిశలో సంచారం సింహ రాశి వారికీ అనుకోని లాభాలను తీసుకురానుంది. జీవితంలో కొనసాగుతున్న కష్టాలు క్రమంగా తొలిగిపోతాయి. సమాజాన్ని ప్రభావితం చేసే సామర్ధ్యం మీలో ఉంటుంది. అంతేకాదు భిన్నమైన ఆలోచనలతో నాయకత్వం వైపు అడుగులు వేస్తారు. అనుకోని ప్రయాణాలు వలన ఆకస్మిక ధనలాభం కలగనుంది.  

4 /5

ధనుస్సు రాశి శని ప్రత్యక్ష సంచారం వలన  ధనుస్సు రాశి మంచి రోజులు మొదలు కానున్నాయి. మీలో ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతోంది. కెరీర్ కోసం ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటారు.  పనిచేసే కార్యాలయాల్లో అధికారుల మెప్పు పొందుతారు. మీ పనికి తగిన గౌరవం లభిస్తుంది.  కొండంత బాధ్యతలను కూడా ఎంత చాకచార్యంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు మెండుగా న్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.

5 /5

గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Media ధృవీకరించడం లేదు.