Shani Remedy: శని పీడతో బాధపడుతున్నప్పుడు ఏ పనులు కావు. తీవ్ర దుఃఖంతో మునిగిపోతారు. వ్యాపారాలు కుంటుపడతాయి. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అయితే, జాతకంలో శని దశ బాగుంటే అన్ని శుభాలను అందిస్తాడు. అయితే, శని బాధ నుంచి బయటపడాలంటే కొన్ని వస్తువులను శనిదేవుడికి సమర్పించాలి. దీంతో ఎలాంటి శని పీడ నుంచి అయినా సులభంగా బయటపడవచ్చు.
శని దేవుడు మన కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. దీన్ని అనుసరించి వ్యక్తి జీవితంలో సుఖాలు, దుఃఖాలు ఉంటాయి. అయితే, శని దశలో మంచి రోజులు కూడా వస్తాయి. శని సాడేసతి, దైయతో బాధపడతారు.
ఆ తర్వాత శని దేవుడు వారి జాతకంలో అశుభ స్థానం నుంచి వెళ్లిపోయే ముందు కూడా వారికి శుభాలను అందిస్తాడు. అయితే, శని పీడతో బాధపడకుండా ప్రభావం తగ్గాలని అనుకుంటే ఈ రెమిడీ ట్రై చేయండి.
జ్యోతిష్యుల ప్రకారం ప్రతి శనివారం శనిని ఆరాధించాలి. మీ దగ్గర్లో ఉన్న నవగ్రహాల వద్దకు వెళ్లి నల్ల నువ్వులు సమర్పించండి. ఇవి శని భగవాణుడికి ఎంతో ప్రీతికరం.
అలాగే శనిదేవుడికి రాళ్ల ఉప్పు కూడా సమర్పిస్తారు. శని విగ్రహాం ముందు ఇవి సమర్పించాలి. ఏవైనా నీలం రంగు పుష్పాలను కూడా శనిదేవుడికి సమర్పించాలి. దీంతో శనిదేవుడు అనుగ్రహిస్తాడు.
ఇంకా నువ్వుల నూనెతో అభిషేకం చేసినా శని దేవుడు కటాక్షిస్తాడు. మూగ జీవాలకు ఆహారం ఇవ్వాలి. పేదలకు ముఖ్యంగా వయ్సులో పెద్దవారికి ఆహారం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల శని బాధల నుంచి త్వరగా విముక్తి కలుగుతుంది.