Sharad Purnima Effect 2024: శరత్ పూర్ణిమను చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జీవింతంలో ఉన్నతంగా ఎదుగుతారని పండితులు చెబుతుంటారు.
అశ్వయుజ మాసంలో వచ్చే శరత్ పూర్ణిమను ఎంతో శుభప్రదమైందని చెప్తుంటారు. ఈ సారి శరత్ పూర్ణిమ 16వ తేదీ సాయంత్రం ప్రారంభమై, ఆ తర్వాత 17 వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంది. 17 న సూర్యోదయానికి పూర్ణిమ ఉండటంతో.. ఆరోజున పూర్ణమి పూజ చేస్తారు. ఈ సమయంలో మనం ఏ పనిచేసిన కూడా అది గొప్పయోగం కల్గిస్తుందని చెప్తుంటారు..
శరత్ పూర్ణిమ రోజున శ్రీ మహా విష్ణువు లక్ష్మి దేవి, శ్రీకృష్ణుడిని, చంద్రుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం శరత్ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి జన్మించిందని చెప్తుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుందంట.
అందుకే శరత్ పూర్ణిమను అంతగొప్పదిగా భావిస్తారు. శరత్ పౌర్ణమి రోజున రాత్రి వెన్నెలలో.. బియ్యంతో చేసిన పాయసం ఉంచాలి. దీన్ని ఆ తర్వాత ప్రసాదంగా తీసుకొవలి. ఇలా చేస్తే అఖండ ధనయోగం కల్గుతుంది.
16 వ తేదీ రాత్రి 10 నుంచి 12 గంటల వరకు చంద్రుడి కాంతి మన మీద పడేలా చూసుకుంటే.. జాతకంలో ఏర్పడిన దోషాలన్ని పోతాయని పండితులు చెబుతుంటారు. అదే విధంగా రాత్రి పూట లతితా పారాయణ కూడా చేసుకొవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
ఈరోజున ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు.. రావిచెట్టు నీడలో నెయ్యిదీపం వెలిగించాలి. ఆతర్వాత బ్రాహ్మణులకు దానాలుగా బియ్యం, పెరుగు, పాలను దానంగా ఇవ్వాలి..
ముఖ్యంగా చంద్రుడు మనస్సుకు సంబంధించిన కారకుడు. అందుకే ఈ రోజున తెల్లని వస్తువులు దానంగా ఇస్తే మంచి యోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
దాదాపు వందల ఏళ్ల తర్వాత ఈ శరత్ పూర్ణిమ రోజున కొన్ని గ్రహాలు కూడా ఒకే సరళ రేఖపై వస్తున్నాయని, మెయిన్ గా శని, చంద్రుడు, బుధ గ్రహాలు ద్వాదశ రాశులపై శుభయోగం కురిపించబోతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)