Khaleda zia: ఖలిదా జియా ఎవరు.. 17 ఏళ్ల జైలు శిక్ష నుంచి విడుదలైన హసీనా బద్ధ శత్రువు గురించి ఈ విషయాలు తెలుసా..?

Begum Khaleda Zia: బంగ్లాదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 17 ఏళ్ల  జైలు శిక్షలో భాగంగా జైలులో మగ్గుతున్న.. మాజీ ప్రధాని ఖలిదా జియాను జైలు నుంచి విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.

1 /7

ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం అనిశ్చితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల అంశం ఏకంగా బంగ్లా పీఠాన్ని కుదిపేసింది. ఈ నేపథ్యంలో..మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశాధ్యక్షుడు కీలక  ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మాజీ ప్రధాని ఖలిదాజియా నుంచి జైలు నుంచి విడుదల చేశారు.   

2 /7

విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న జియా విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆమె గృహనిర్భందం నుంచి విడుదలయ్యారు. గత కొన్నేళ్లుగా ఆమె ఈ కేసులో భాగంగా.. జైలు శిక్షను  అనుభవిస్తున్నారు.

3 /7

ఖలీదా జియా అవిభాజ్య భారత్‌లోని పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం జల్‌పాయిగుడీలో 1945 ఆగష్టు 15న జన్మించారు. ఖలీదా భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుర్ రెహమాన్. 1977 నుంచి 1981 వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు.   

4 /7

1981లో జియావుర్ రెహమాన్ హత్యకు గురికావడంతో ఖలీదా జియా బేగం రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పుకొవచ్చు. అప్పటినుంచి ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

5 /7

ఇదిలా ఉండగా..ఖలిదా 1991 లో బంగ్లాదేశ్ కు తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికోసం ఇతర పార్టీల మద్దతు తీసుకున్నారు. మరల 1996 లో రెండోసారి ఖలీదా ఎన్నికలలో విజయంసాధించారు. ఈ ఎన్నికలలోఅక్రమాలు జరిగాయని అవామీలీగ్, మరికొన్నిపార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి.  

6 /7

ఆతర్వాత జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా.. షేక్ హసీనా విజయంసాధించింది. రెండో మహిళ ప్రధానిగా ఎన్నికైంది. ఆ తర్వాత మరల ఐదేళ్ల తర్వాత జియా మరల పీఎం అయ్యింది. 2001 నుంచి 2006 వరకు పీఎంగా ఉన్నారు.  

7 /7

2018 లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో.. ఖలీదా జియా.. పదిహేడేళ్ల జైలు పనిష్మెంట్ కు గురయ్యారు.  ఆతర్వాత నుంచి ఆమె జైలులోని మగ్గిపోయారు. ప్రస్తుతం 78 ఏళ్ల ఖలీదా జియా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమె మరోసారి పీఎంగా బాధ్యతలు స్వీకరించవచ్చని వార్తలు  వైరల్ గా మారాయి.