Manmadha Re Release: రీ రిలీజ్ లో కూడా వసూళ్లు దుమ్ము దులుపుతున్న శింబు ‘మన్మథ’.. ఇదెక్కడి మాస్ రచ్చరా మావ..!

Manmadha Re Release: శింబు, జ్యోతిక హీరో, హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం  ‘మన్మథ’. తమిళంలో మన్మథన్ పేరుతో విడుదలైంది. 2004లో విడుదలైన ఈ సినిమా  20 యేళ్ల తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజైంది.

 

1 /5

Manmadha Re Release: ఎస్.జే.మురుగన్ దర్శకత్వంలో శింబు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది.

2 /5

తాజాగా ఈ సినిమాను సాయి సుధా రాజకొండ, అజిత్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఈ నెల 5న మళ్లీ విడుదల చేసారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

3 /5

ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు పలు కొత్త చిత్రాలు విడుదలైన గట్టి పోటీ మధ్య ‘మన్మథ’ సినిమా తన ఉనికిని చాటుకుంది. ఈ సినిమా సింధు తులాని, మందిరా బేడి, యానా గుప్త, అతుల్ కులకర్ని, అర్జు గోవిత్రిక లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు.

4 /5

గత కొన్నేళ్లుగా రీ రిలీజ్ లకు ఉన్న ట్రెండ్ నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం మళ్లీ విడుదలైవుతున్న సినిమాలకు ధీటుగా  రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఈనెల 5న రీ రిలీజ్ అయిన ‘మన్మథ’  సినిమా కలెక్షన్లతో దుమ్ము దులుపుతోంది.

5 /5

శింబు, జ్యోతిక జోడికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నాయి.  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా దసరా కానుకగా రీ రిలీజైన ఈ సినిమా మొత్తంగా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.