Shiva Favourite Zodiac Signs: శివునికి ఎంతో ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడూ డబ్బే డబ్బు..


Shiva Favourite Zodiac Signs: హిందూ పురాణాల ప్రకారం మహా శివుడిని అత్యున్నత దైవంగా భావిస్తారు. అందుకే శివుడిని పరమేశ్వరుడిగా పిలుస్తారు. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. అందుకే ఈ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి శ్రావణమాసంలో శివుడిని పూజించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. 
 

1 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులకు శివుడికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే కొన్ని రాశులను శివుడికి ఇష్టమైన రాశులుగా భావిస్తారు. ఈ రాశుల వారు ఎలాంటి సమస్యల్లో ఉన్న శివుడు రక్షిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 /7

అలాగే శ్రావణమాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన కొన్ని రాశుల వారు ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే శివుడికి ఇష్టమైన రాశులేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

3 /7

శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. అందుకే మకర రాశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాశి వారు శ్రావణమాసంలో శివుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

4 /7

అలాగే మకర రాశి వారికి శివుడి అనుగ్రహం లభించి ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధించే శక్తిని పొందుతారు. శ్రావణమాసంలో ఈ రాశి వారు తప్పకుండా ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది.   

5 /7

మేష రాశి వారికి శివుడి అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలైనా పూర్తిగా పరిష్కారం అవుతాయి.  దీంతోపాటు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న వారికి శివుడి ప్రత్యేకమైన ఆశీస్సులు లభించి సమస్యలన్నీ తొలగిపోతాయి.    

6 /7

అలాగే మేష రాశి వారు శివుడికి శ్రావణమాసం గంగాజలం తో అభిషేకం చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కెరీర్ కు సంబంధించిన విషయంలో కూడా పురోగతి లభిస్తుంది. అలాగే పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

7 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివునికి అత్యంత ప్రీతికరమైన రాశుల్లో కుంభరాశి ఒకటి. ఈ రాశి వారికి కూడా శివుడి అనుగ్రహం లభించి జీవితంలో ఆనందంతోపాటు డబ్బును పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా చేయగలుగుతారు.