Shivathmika Rajasekhar: ప్రేమలో పడేస్తున్న శివాత్మిక రాజశేఖర్.. పసుపు రంగు చీరలో అందాలు..!

Shivathmika Rajasekhar stunning photosin saree: యాంగ్రీ యంగ్ మాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు.. వెంటనే గుర్తొచ్చే పేరు రాజశేఖర్. ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన రాజశేఖర్.. ఇప్పుడు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఆయన కూతుర్లు.. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్..మాత్రం తండ్రికి తగ్గట్టుగానే మంచి సినిమాలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా శివాని రాజశేఖర్ షేర్ చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో.. తెగ ఆకట్టుకుంటున్నాయి. 

1 /5

ఎన్నో సంవత్సరాల పాటు యాంగ్రీ యంగ్ మాన్ గా తనకంటూ.. మంచి పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. జీవితాన్ని పెళ్లి చేసుకున్న ఈ హీరోకి.. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్.. అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిద్దరూ కూడా కొన్ని సినిమాలలో కనిపించి.. తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

2 /5

శివాని రాజశేఖర్ ఎక్కువగా ఓటీటీ సినిమాల్లో.. కనిపించింది. మరో పక్క శివాత్మిక రాజశేఖర్.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమాతో.‌.తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మ.

3 /5

మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈ హీరోయిన్ ఆ తరువాత.. కొన్ని అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా.. శివాత్మిక రాజశేఖర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కూతురుగా ఈ సినిమాలో.. కనిపించి తన నటనతో మెప్పించింది ఈ హీరోయిన్.

4 /5

అయితే శివాత్మిక రాజశేఖర్.. సినిమాలకన్నా కూడా సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో.. ఎప్పుడు యాక్టివ్ గా కనిపిస్తూ తరచూ.. ఏవో ఒక ఫోటో షేర్ చేస్తూ.. ఉంటుంది శివాత్మిక.

5 /5

తాజాగా శివాత్మిక.. చీరలో షేర్ చేసిన ఫోటోలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో పసుపు రంగు చీరలో కనిపిస్తూ.. శివాత్మిక సినీ ప్రేక్షకులను ప్రేమలో పడేస్తోంది. ఈ ఫోటోలు చూసినవారు.. ఈ హీరోయిన్ కి అవకాశాలు రావడం ఖాయం.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఎంతో మంది అభిమానులు.