World Egg Day: గుడ్డుతో కలిపి ఏయే వస్తువులు తినడం మంచిది కాదో తెలుసా

అక్టోబర్ 8వ తేదీ ప్రపంచ గుడ్డు దినోత్సవం. గుడ్డుతో కలిగే ప్రయోజనాలు అపారం. ఉదయం అల్పాహారం నుంచి మొదలుకుని మద్యాహ్నం భోజనం వరకూ చాలామంది గుడ్డును తీసుకుంటారు. ప్రోటీన్లతో నిండిన గుడ్డు శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది. కానీ గుడ్డుతో కలిపి కొన్ని పదార్ధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల చాలా దుష్పరిణామాలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకుందాం.

World Egg Day: అక్టోబర్ 8వ తేదీ ప్రపంచ గుడ్డు దినోత్సవం. గుడ్డుతో కలిగే ప్రయోజనాలు అపారం. ఉదయం అల్పాహారం నుంచి మొదలుకుని మద్యాహ్నం భోజనం వరకూ చాలామంది గుడ్డును తీసుకుంటారు. ప్రోటీన్లతో నిండిన గుడ్డు శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది. కానీ గుడ్డుతో కలిపి కొన్ని పదార్ధాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల చాలా దుష్పరిణామాలు ఎదురవుతాయి. అవేంటో తెలుసుకుందాం.

1 /5

సోయా మిల్క్ మరియు గుడ్డు వేర్వేరుగా అయితే శరీరానికి చాలా మంచిది. కానీ ఈ రెండూ కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. సోయా మిల్క్‌ తో కలిపి గుడ్డు తినడం వల్ల ప్రోటీన్ల జీర్ణక్రియ నిలిచిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

2 /5

గుడ్డు మరియు పన్నీర్. రెండూ ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండేవే. కానీ గుడ్డు, పన్నీర్ కలిపి తీసుకోవడం ఎప్పటికీ చేయకూడదు. అలా చేస్తే మీ జీర్ణక్రియ మందగిస్తుంది. 

3 /5

ఉడకబెట్టిన గుడ్డు, చేప కాంబినేషన్ ఆరోగ్యానికి చాలా నష్టం కల్గిస్తుంది. అందుకే ఎప్పుడూ ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ తీసుకుంటే ఎలర్జీతో పాటు చాలా సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

4 /5

గుడ్డును ఎప్పుడూ పంచదారతో కలిపి తినకూడదు. గుడ్డు, పంచదార కలిపి వండితే రెండింటి నుంచి ఉత్పన్నమయ్యే ఎమైనా యాసిడ్ శరీరంలో విషపూరితం కాగలదు. ఈ కాంబినేషన్ వల్ల మీ బాడీలో బ్లడ్‌క్లాట్ అయ్యే అవకాశాలున్నాయి.

5 /5

గుడ్డుతో కలిపి కొంతమంది వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది గుడ్డు తిన్న తరువాత టీ తాగుతుంటారు. వైద్య నిపుణులు చెప్పినదాని ప్రకారం ఈ అలవాటు శరీరానికి అంటే ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుంది. గుడ్డు తిన్న తరువాత టీ తీసుకోవడం మంచిది కానే కాదు.