Beauty Lips: మేకప్ అనేది అమ్మాయిల జీవితంలో ఓ భాగమని చెప్పవచ్చు. అంతగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో లిప్‌స్టిక్ అతి ముఖ్యమైంది. లిప్‌స్టిక్ లేకుండా మేకప్ అనేది అసంపూర్తిగానే ఉంటుంది. మీ పెదాల్ని మరింత మృదువుగా, మెత్తగా మార్చుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
ఇంట్లోనే రంగు రంగుల లిప్‌స్టిక్ తయారు చేసుకోవచ్చు. లిప్‌స్టిక్ తయారుచేసేటప్పుడు కావల్సిన రంగును ఎంచుకోవచ్చు. మొత్తానికి హోమ్ మేడ్ లిప్‌స్టిక్ అయితే పెదాలు సురక్షితంగా ఉంటాయి.
స్వీట్ బాదం ఆయిల్-బీట్‌రూట్ పౌడర్ స్వీట్ బాదం ఆయిల్, బీట్‌రూట్ పౌడర్ ఒకేసారి కరిగించడం ద్వారా లిప్‌స్టిక్ తయారు చేసుకోవచ్చు. దీంతో ఆకర్షణీయమైన డార్క్ పింక్ కలర్ వస్తుంది. పెదాలకు కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.
బీట్‌రూట్-బటర్ బీట్‌రూట్ బటర్ కరిగించి కూడా లిప్‌స్టిక్ తయారు చేసుకోవచ్చు. పెదాల్ని అంతర్గతంగా హైడ్రేట్‌గా ఉంచేందుకు దోహదం చేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రాస్తుంటే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
కొబ్బరి నూనె-ల్యావెండర్ ఆయిల్ కొబ్బరి నూనె అనేది పెదాలతో పాటు చర్మానికి చాలా మంచిది. రోజూ మాలిష్ అనేది అవసరం. కొబ్బరి నూనె, ల్యావెండర్ ఆయిల్ కలిపి లిప్‌స్టిక్ తయారు చేసుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ వాడితే ఇంకా మంచి ఫలితాలుంటాయి.
కొబ్బరి నూనె-కోకో పౌడర్ లిప్‌స్టిక్ అనేది అమ్మాయిల అందాన్ని మరింతగా పెంచుతుంది. మీరు రాసే లిప్‌స్టిక్ మంచిది కాకపోతే పెదాలు డ్రైగా మారి పాడవుతుంటాయి. అందుకే ఇంట్లో సులభంగా తయారుచేసుకునే లిప్‌స్టిక్‌తో పెదాలు ఏమాత్రం పాడవవు. కొబ్బరి నూనె, కోకో పౌడర్, పెట్రోలియం జెల్లీతో ఈ లిప్‌స్టిక్ తయారు చేసుకోవచ్చు.