Singer Sunitha wedding photos: సింగర్ సునీత పెళ్లి ఫోటోలు

ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో శనివారం సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.

  • Jan 10, 2021, 09:23 AM IST

ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో శనివారం సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో సింగర్ సునీత, రామ్ వీరపనేనిల వివాహం జరిగింది. గతంలో కిరణ్‌ని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆయనతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు.

1 /7

అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో సింగర్ సునీత, రామ్ వీరపనేనిల వివాహం జరిగింది. గతంలో కిరణ్‌ని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆయనతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు. 

2 /7

43 ఏళ్ల సునీతకు మునుపటి వివాహం ద్వారా ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఇద్దరూ చదువు పూర్తి చేసి, వృత్తిలో నిలదొక్కుకునే పనిలో బిజీ అయ్యారు.

3 /7

ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు, ప్రమోషన్‌ యాక్టివిటీస్ నిర్వహించే డిజిటల్ మీడియా సంస్థకు రామ్ వీరపనేని సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

4 /7

సునీత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా రామ్ వీరపనేనికి చెందిన డిజిటల్ మీడియా ప్రమోషన్స్ సంస్థనే నిర్వహిస్తున్న కారణంగా ఆ ఇద్దరి మధ్య చాలాకాలంగా పరిచయం ఉంది. ఒకరికొకరు బాగా తెలుసు. రామ్ కూడా తన మొదటి భార్య నుండి చాలా కాలం క్రితమే డైవర్స్ తీసుకున్నారు. రామ్‌కి పిల్లలు లేరు.

5 /7

తెలుగు సినీ పరిశ్రమలోని అందమైన గాయనీమణులలో సింగర్ సునీత కూడా ఒకరు. సింగర్ సునీత వాయిస్ అంటే ఇష్టపడని వారు లేరు. ఆమె తన పాటలతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

6 /7

సింగర్ సునీత, రామ్ వీరపనేని జంటను ఆశీర్వదించేందుకు అనేక మంది సినీ ప్రముఖులు, అత్యంత సన్నిహిత మిత్రులు ఈ పెళ్లి వేడుకకు తరలివచ్చారు.

7 /7

సింగర్ సునీతకు ఆమె పిల్లలే పెళ్లి పెద్దగా మారి దగ్గరుండి తల్లి వివాహం జరిపించడం సింగర్ సునీత పెళ్లి ( Singer Sunitha wedding ) వేడుకలో హైలైట్‌గా నిలిచింది. Also read : Singer Sunitha haldi ceremony photos: సింగర్ సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు   Also read : Actress Pranitha Subhash: ప్రణీత సుభాష్‌కి కాబోయే భర్త ఇలా ఉండాలంట   Also read : Niharika Konidela: పెళ్లి తర్వాత నిహారిక కొత్త ప్రయత్నం   Also read : Speed weight loss foods: వేగంగా అధిక బరువు తగ్గించే ఫుడ్స్