Sita Ashtami 2024: సీతాష్టమి ఎప్పుడొస్తుంది ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది

ప్రతి ఏటా ఫల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అష్టమినే సీతాష్టమిగా పిలుస్తారు. దీనినే మరోలా సీతా జయంతి లేదా జానకి జయంతిగా కూడా పరిగణిస్తారు. సీతాష్టమి అంటే చాలు దేశంలో ప్రముఖంగా గుర్తొచ్చేది మధ్యప్రదేశ్‌లోని సుప్రసిద్ధ ఆలయం కరీలా ధామ్. సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది ఇక్కడేనంటారు. 

Sita Ashtami 2024: ప్రతి ఏటా ఫల్గుణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అష్టమినే సీతాష్టమిగా పిలుస్తారు. దీనినే మరోలా సీతా జయంతి లేదా జానకి జయంతిగా కూడా పరిగణిస్తారు. సీతాష్టమి అంటే చాలు దేశంలో ప్రముఖంగా గుర్తొచ్చేది మధ్యప్రదేశ్‌లోని సుప్రసిద్ధ ఆలయం కరీలా ధామ్. సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చింది ఇక్కడేనంటారు. 

1 /5

ప్రత్యేక పూజల తరువాత పూజా సామగ్రిని హవనం చేయాలి. పూర్తిగా భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి.   

2 /5

సీతాదేవి పోటో లేదా విగ్రహానికి ఓ వస్త్రంపై ఉంచి ప్రతిష్టించాలి. సీతాదేవితో పాటు రాముడు ఉన్న ఫోటో కూడా ప్రతిష్టించవచ్చు. 

3 /5

కోర్కెలు నెరవేరాలంటే సీతాష్టమి వ్రతం తప్పకుండా ఆచరించాలంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. 

4 /5

ఈ ఏడాది సీతాష్టమి మార్చ్ 4వ తేదీన ఉంది. సోమవారం రోజు కావడంతో ఆ రోజు వ్రతం ఆచరిస్తే చాలా మంచి జరుగుతుందంటారు. ఎవరైనా వివాహిత మహిళ సీతాష్టమి వ్రతం ఆచరిస్తే ఆమె వైవాహిక జీవితం చాలా బాగుంటుందంటారు. అవివాహితులకైతే మంచి వరుడు లభిస్తాడు.

5 /5

ఫల్గుణమాసంలోని అష్టమి తిధిని జానకి అష్టమి, సీతాష్టమి లేదా ఫాల్గుణ అష్టమిగా పిలుస్తారు. ఈరోజున వ్రతం ఆచరిస్తే మంచిదని నమ్మకం.