Ind vs Eng: కోహ్లీ, షమీ, రాహుల్ స్టార్ ఆటగాళ్లు లేకుండానే టెస్ట్ సిరీస్ నెగ్గిన టీమ్ ఇండియా

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌లో మర్చిపోలేని అనుభూతిని అందించింది. దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే టీమ్ ఇండియా..ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 3-1తో గెల్చుకుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా దూరంగా ఉండటం విశేషం.

Ind vs Eng: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌లో మర్చిపోలేని అనుభూతిని అందించింది. దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే టీమ్ ఇండియా..ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 3-1తో గెల్చుకుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టెస్ట్ సిరీస్‌కు పూర్తిగా దూరంగా ఉండటం విశేషం.

1 /5

వాస్తవానికి విరాట్ కోహ్లి ఇంగ్లండ్ టెస్ట్‌సిరీస్‌లో టీమ్ ఇండియాలో ఉన్నాడు. కానీ వ్యక్తిగత కారణాలతో అన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇటీవలే రెండవసారి తండ్రి అయ్యాడు. ఈసారి కొడుకు పుట్టాడు. కోహ్లీ స్థానంలో టీమ్ ఇండియాకు రజత్ పాటిదార్ ఆడాడు. 

2 /5

వరల్డ్‌కప్ 2024 టాప్ వికెట్ టేకర్ మొహమ్మద్ షమీ మొత్తం సిరీస్‌కే దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లో మడమకు తగిలిన గాయం కారణంగా లండన్‌లో సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 

3 /5

విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు..కేఎల్ రాహుల్ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. రాహుల్ మొదటి టెస్ట్ ఆడి 88, 22 పరుగులు చేశాడు. ఆ తరువాత మ్యాచ్‌లు ఆడలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం రెండవ టెస్ట్ తరువాత జట్టుకు దూరమయ్యాడు. 

4 /5

మొదటి టెస్ట్ తరువాత కేఎల్ రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా బయటికొచ్చేశాడు. రవీంద్ర జడేజా మూడవ టెస్ట్‌కు తిరిగొచ్చేశాడు. ఇక మరో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బూమ్రా సైతం నాలుగో టెస్ట్ ఆడలేదు. అతడి స్థానంలో ఆకాష్ దీప్‌కు స్థానం లభించింది. 

5 /5

ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా టీమ్ ఇండియాలో ఏకంగా నలుగురు క్రికెటర్లు డెబ్యూ చేశారు. వీరిలో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ఆకాష్ దీప్, ధృువ్ జురేల్ ఉన్నారు. మొత్తానికి కీలకమైన స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమ్ ఇండియా ఇంగ్లండ్ సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకోవడం విశేషం.