Sitaphal Myths and Facts: సీతాఫలం అద్భుత ప్రయోజనాలు, డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా

ఏడాదితోసారి సీజనల్‌గా లభించే సీతాఫలాలతో ఎన్ని రకాల అద్భుత ప్రయోజనాలున్నాయో తెలుసా. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే గుణాలు సీతాఫలాల్లో చాలా ఎక్కువ. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లభించే సీతాఫలాల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలాలు తినవచ్చా లేదా..ఆయాసం సమస్య ఉన్నవారు తినవచ్చా లేదా అనేది కూడా పరిశీలిద్దాం.

Sitaphal Myths and Facts: ఏడాదితోసారి సీజనల్‌గా లభించే సీతాఫలాలతో ఎన్ని రకాల అద్భుత ప్రయోజనాలున్నాయో తెలుసా. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే గుణాలు సీతాఫలాల్లో చాలా ఎక్కువ. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లభించే సీతాఫలాల్లో పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలాలు తినవచ్చా లేదా..ఆయాసం సమస్య ఉన్నవారు తినవచ్చా లేదా అనేది కూడా పరిశీలిద్దాం.
 

1 /5

సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా ఉంటుంది. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. 

2 /5

సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసిటీ, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దాంతో డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలాలు తినవచ్చు.

3 /5

సీతాఫలాల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కారణంగా..కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. 

4 /5

సీతాఫలాల్లో విటమిన్ సి, విటమని ఎ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. అల్సర్ల నివారణ, ఎసిడిటీ దూరం చేయడంలో సీతాఫలాలు చాలా ఉపయోగపడతాయి. ఇందులోని సూక్ష్మ పోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

5 /5

ప్రతి ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో లభించే సీతాఫలాల్లో చాలా పోషక విలువలున్నాయి. అందుకే సీతాఫలాల్ని విటమిన్లు, ఖనిజాలు కలిగి పోషకాల గని అంటారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.