Solar Eclipse 2020 Date and Timings | 2020లో మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది.
సూర్యగ్రహణం సమయంలో కొత్తగా ఏ పనులు చేపట్టవద్దని పెద్దలు, జ్యోతిష్కులు, ఖగోళ నిపుణులు సూచిస్తున్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షిస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాత్రివేళ సూర్యగ్రహణం కావడంతో అంతగా సమస్యేమీ లేదు.
గ్రహణం సమయంలో బయట తిరగవద్దు. నిర్మానుష్య ప్రదేశాలకు అసలు వెళ్లకపోవడం మంచిది. సూర్యగ్రహణం సమయంలో చెడు శక్తులు ప్రభావం చూపుతాయని విశ్వాసం. ముఖ్యంగా మిథునరాశి, మీనరాశి, మేషరాశి, కన్యరాశి, ధనుస్సు రాశుల వారిపై సూర్యగ్రహణం ప్రభావం చూపనుంది.
సూర్యగ్రహణం (Solar Eclipse 2020) సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. గ్రహణం సమయంలో పదునైన వస్తువులు వాడరాదు.
సూర్యగ్రహణం 2020 సమయంలో నిద్రపోవడం అంత మంచిది కాదు. అయితే పిల్లలు, వయసు మీద పడ్డ పెద్దవారు ఆరోగ్యం సరిగా లేకపోతే విశ్రాంతి తీసుకోవచ్చు. Also Read: Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం అధిక ప్రభావం!
సూర్యగ్రహణం సమయంలో ఆహారం తీసుకోరాదు. గ్రహణానికి ముందే తినడం మంచిది. పూజా గదిలో దేవుడి విగ్రహాలు, పటాలు తాకరాదు. Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్లో పరిస్థితి ఏంటంటే!