Sreeleela: సీతాకోకచిలుకలా శ్రీలీల.. ఈ ఫోటోలు చూస్తే ప్రేమలో పడాల్సిందే

Sreeleela Sensational Pics: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అభిమానుల సంఖ్య ఎక్కువ ఉండే హీరోయిన్ ఎవరు అంటే ముందుగా శ్రీలీల పేరే వినిపిస్తుంది.

  • Feb 14, 2024, 20:25 PM IST
1 /5

Sreeleela Viral Pics:  తెలుగులో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తెలుగమ్మాయి ఆ తరువాత రవితేజ ధమాకా చిత్రంలో నటించి సూపర్ హిట్ అందుకుంది.

2 /5

వెంటనే ఈ హీరోయిన్ దగ్గర దగ్గర డజన్ సినిమాల ఆఫర్లు దక్కించుకోవడమే కాకుండా తెలుగులో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది. 

3 /5

వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ తెలుగులో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో కూడా నటించింది శ్రీ లీల.  

4 /5

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ గుంటూరు కారం ఓటీటీ ప్రమోషన్స్ కోసం శ్రీ లీల ఫోటోలను కొన్ని షేర్ చేసింది.

5 /5

ఈ ఫోటోలలో చిలకపచ్చ రంగు చీరలు.. సీతాకోక చిలక లాగా మెరిసిపోతూ.. తన అభిమానులను ప్రేమలో పడేస్తోంది ఈ నటి.