Shriya: గోల్డ్ రంగు చీరలో నిగనిగలాడిన శ్రియ.. వయసు ఎప్పుడు పాతికే..

Shriya Saran: శ్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంవత్సరాలు పెరుగుతున్న ఆమె వయసు మాత్రం తగ్గుతూనే వస్తోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మరోసారి అభిమానుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

  • Jan 15, 2024, 19:28 PM IST
1 /6

Shriya Saran: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. ఆ తరువాత సంతోషం, నువ్వే నువ్వే, చెన్నకేశవరెడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.  

2 /6

తెలుగు ఇండస్ట్రీలో శ్రియ నటించిన హీరో లేదు అన్నడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి దగ్గర నుంచి మహేష్ బాబు వరకు…బాలకృష్ణ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు.. తరుణ్ దగ్గర నుంచి రాజా వరకు అందరూ హీరోలతో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్.

3 /6

ఈమధ్య రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పుడు క్యారెక్టర్ కి తల్లిగా కనిపించింది. కాగా శ్రియ తెలుగులో చివరగా కనిపించిన సినిమా ఇదే.

4 /6

అయితే నాలుగు పదులు దాటినా కానీ శ్రియా వయస్సు ఇప్పటికీ పాతికేళ్లు లాగే కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యార్థకం. ఇప్పటికీ శ్రియ అని హీరోయిన్గా తీసుకుంటే తెలుగు ప్రేక్షకులు తప్పక చూస్తారు.

5 /6

దాదాపు అన్ని ఇండస్ట్రీలలో ఆఖరికి హాలీవుడ్లో సైతం నటించిన శ్రియకి ఎక్కువ అభిమానులు ఉండేది మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే. అందుకే శ్రియా మళ్లీ ఎప్పుడు తెలుగు సినిమాలో కనిపిస్తుందని ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు.

6 /6

కాగా ఈ మధ్య శ్రియ అమీర్ ఖాన్ కూతురు రిసెప్షన్ లో తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గోల్డ్ శారీలో మెరిసిపోతూ కనిపించింది ఈ హీరోయిన్.