Adivi Sesh: ఇద్దరు హీరోయిన్స్ అవుట్.. అడివి శేష్ కే ఎందుకిలా.?

Adivi Sesh Movies: వైవిద్యమైన సినిమాలతో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడివి శేష్. అయితే ప్రస్తుతం మాత్రం.. హీరోయిన్స్ పరంగా ఈ హీరోకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాబోయే రెండు చిత్రాలు.. ఈ హీరో పై ఎన్నో కంప్లైంట్స్ తెచ్చుపెడుతున్నాయి.

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు దక్కించుకున్న అడవి శేష్ (Adivi shesh) ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు.   

2 /5

ఇక ఇప్పుడు మేజర్, హిట్ -2 వంటి చిత్రాల తర్వాత తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం డెకాయిట్. మరోవైపు గూఢచారి 2 సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఇకపోతే గూఢచారి -2 సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అయినా అంతకంతకు ఆలస్యం అవుతోంది. 

3 /5

ఇందులో బాలీవుడ్ బ్యూటీ బనిత సంధు ను హీరోయిన్గా అనుకున్నారు.  అయితే ఆమె మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది.మరొకవైపు డెకాయిట్ సినిమా నుంచి శృతిహాసన్ కూడా బయటకు వచ్చినట్లు సమాచారం.  ఈ కుర్ర హీరో మూవీస్ నుంచి హీరోయిన్లు ఇలా తప్పుకోవడంతో రకరకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

4 /5

ముఖ్యంగా ఈ హీరో వ్యవహారం నచ్చకే బయటకి వస్తున్నారని కొంతమంది కామెంట్లు చేయగా,  మరికొంతమంది క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే అని, ఇంకొంతమంది డేట్స్ సమస్యల వల్ల అంటూ ఇలా ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు వినిపిస్తున్నారు. 

5 /5

మరొకవైపు ఇలా అడివి శేష్ సినిమాల నుంచి హీరోయిన్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈయన చిత్రాలకు మును ముందు హీరోయిన్లు లభిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.