Summer heat Wave: కొన్నిరోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాలు భానుడి దెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రిలను దాటేశాయి.దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.
కొన్నిరకాల ఫ్రూట్స్ లను మన డైట్ లో యాడ్ చేస్తే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణంగా వచ్చే పండ్లు మార్కెట్ లో కన్పిస్తుంటాయి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా, చల్లగా ఉంచేలా చేస్తు, విటమిన్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈ పండ్లను తినాలని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయలు: వేసవిలో తినడానికి ఉత్తమమైన పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
నారింజలు: విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో పాటు, నారింజలో పొటాషియం, పోషకాలు కూడా ఉంటాయి. ఇవి కండరాల నొప్పి, తిమ్మిరి చికిత్సకు సహాయపడతాయి. నారింజ బలమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, వ్యాధులతో పోరాడటానికి శరీరాన్ని అనుమతిస్తుంది.
కివీస్: ఆరెంజ్‌ల మాదిరిగానే, కివీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం చల్లగా ఉండలే చేస్తాయి. విటమిన్లు, పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటాయి.

పీచెస్: పీచెస్ వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి చర్మానికి మేలు చేసే జ్యుసి ఫ్రూట్స్. అవి విటమిన్లు A, C కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లను కలిగిఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
తాటి ముంజలు: తాడ్గోలా లేదా తాటి పండు అధిక నీటి శాతం కలిగిన మరొక పండు. దాని శీతలీకరణ లక్షణాల కారణంగా, ఇది వేసవికి ఉత్తమమైనది; అధిక నీటి కంటెంట్ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)