Tata Altroz Vs Tata Tiago: టాటాలో ఈ కార్లు కొనుగోలు చేస్తున్నారా? వీటిల్లో ఇదే చాలా బెస్ట్!

Difference Between Tata Tiago And Tata Altroz: టాటాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ ముందున్నాయి. చాలా మంది ఈ రెండు కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. సెఫ్టి పరంగా ఈ రెండు కార్లు ఫైవ్‌ స్టార్ రేటింగ్‌ కలిగి ఉండడం వల్ల వీటి రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో తికమకపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా ఏ కారు బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ రెండు కార్లలో అనేక తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ రెండు కార్ల ధర విషయానికొస్తే, టాటా టియాగో రూ.5.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాటా ఆల్ట్రోజ్ కేవలం రూ.6.65 లక్షలోపే లభిస్తోంది. కాబట్టి ధర పరంగా చూస్తే టాటా టియాగో చాలా తక్కువేనని తెలుస్తోంది. 

2 /5

ఇక ఈ రెండు కార్ల పరిమాణాల వివరాల్లోకి వెళితే, టాటా ఆల్ట్రోజ్ కారు కాస్త పెద్దది, లోపల ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. టాటా టియాగో నాలుగుగురికి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి పరిమాణం విషయంలో మాత్రం టాటా ఆల్ట్రోజ్ గొప్ప ఎంపిగా భావించవచ్చు.   

3 /5

ఈ రెండు కార్ల ఫీచర్స్‌ సంబంధించిన వివరాల్లోకి వెళితే, టాటా ఆల్ట్రోజ్‌లోని హై ఎండ్‌ కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్‌ అందుబాటులో ఉంటాయి. కానీ టియాగో మాత్రం చాలా తక్కువ ఫీచర్స్‌ ఉంటాయి.   

4 /5

టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ వివరాల్లోకి వెళితే..రెండు కార్లు 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో-చార్జ్డ్ డీజిల్ ఇంజన్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. మైలేజ్ కూడా ఈ రెండు కార్లు 19 నుంచి 20 kmpl వరకు ఇస్తాయి. 

5 /5

తక్కువ బడ్జెట్‌లో మంచి మంచి కారు కొనుగోలు చేయాలనుకునేవారికి టాటా టియాగో చాలా బెస్ట్‌, ఎక్కువ పరిమాణం, ఎక్కువ స్పెస్ కావాలనుకునేవారు టాటా ఆల్ట్రోజ్ మంచి ఎంపిగా భావించవచ్చు. అంతేకాకుండా ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా కూడా టాటా ఆల్ట్రోజ్ చాలా బెస్ట్‌.