Shikhar Dhawan: స్టార్ హీరోయిన్‌తో శిఖర్ ధావన్ రెండో పెళ్లి.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా..!

Shikhar Dhawan Marriage Pics: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్.. తన భార్యకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. గతకొద్ది రోజులుగా ధావన్ రెండో పెళ్లి గురించి నెట్టింట వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా శిఖర ధావన్‌కు ఓ స్టార్‌ హీరోయిన్‌తో పెళ్లి అయిపోందంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని పిక్స్‌ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..
 

1 /7

ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన కంటే పదేళ్లు పెద్దది అయినా.. అప్పటికే పెళ్లై ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.  

2 /7

ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. తన కుమారుడు జోరావర్‌ను దూరం చేయడంతో ధావన్ తట్టుకోలేపోయాడు. 2023 అక్టోబర్‌లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.  

3 /7

ఐపీఎల్‌కు కూడా గుడ్‌ బై చెప్పిన ధావన్.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ధావన్ రెండో పెళ్లిపై ఇటీవల వార్తలు జోరందుకున్నాయి.  

4 /7

స్టార్ హీరోయిన్ హుమా ఖురేషిని వివాహం చేసుకున్నట్లు పిక్స్ వైరల్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరు ఎప్పుడు కలిశారని నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు.  

5 /7

వైరల్ అవుతున్న పిక్స్‌లో ఖురేషితో ధావన్ చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు. అయితే ఈ ఫొటోల గురించి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

6 /7

శిఖర్ ధావన్, హుమా ఖురేషి పిక్స్‌ ఫేక్ అని తేలిపోయింది.  AI సాయంతో ఇద్దరి ఫొటోలను ఎడిట్ చేసి షేర్ చేశారు.  

7 /7

ఇటీవల కొందరు టెక్నాలజీని తప్పుడు పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఐశ్వర్యరాయ్-సల్మాన్ ఖాన్, ప్రభాస్-అనుష్క, ప్రభాస్-మృణాల్ ఠాకూర్‌ పిక్స్‌ను కూడా ఇలానే వైరల్ చేసిన విషయం తెలిసిందే.