Telangana Bandh: తెలంగాణలో ఈనెల 9న స్కూళ్లు, కాలేజీల బంద్‌ పిలుపు..!

Maoists Call Bandh In Telangana: చెల్పాకలో నవంబర్‌ 30న జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గురువారం ఈ బంద్‌కు సంబంధించిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్‌ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
 

1 /5

చెల్పాకలో డిసెంబర్‌ 1న విప్లవకారులను అతి దగ్గరగా కిరాతకంగా గ్రేహౌండ్‌ పోలీసులు కాల్చి చంపారు. అప్రూవర్‌గా మారిన ఇన్‌ఫార్మర్‌తో భోజనంలో విషం కలిపి స్పృహ కోల్పోయిన ఏడుగురు విప్లవకారులు పడిపోయారు.  

2 /5

వీరిని అదుపులోకి తీసుకున్న గ్రేహౌండ్‌ పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టి అతి దగ్గరగా డిసెంబర్‌ 1వ తేదీ ఉదయం కాల్చి చంపారు. ఈ ఘటనలో ఏడుగురు విప్లవకారులు చనిపోయారు.  

3 /5

ఇందులో మంగు అలియాస్‌ పాపన్న, జైసింగ్‌, బద్రు, మధు, కోటి, కరుణార్‌, జమున, కిషోర్‌, కామాల్‌లు ప్రాణాలర్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ హత్యకాండకు బాధ్యతవహించాలని డిసెంబర్‌ 9న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.  

4 /5

ప్రజల కోసం పోరాడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్‌ కగార్‌ కొనసాగిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలకు చేస్తున్నారన్నారు.  

5 /5

ఈ దారుణ మరణ కాండకు నిరసనగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా ఈనెల అనగా డిసెంబర్‌ 9న బంద్‌ పాటించాలని మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.