DA Hike: ఉద్యోగులకు పెరిగిన డీఏ.. బేసిక్‌ శాలరీ ఎంత ఉంటే, ఎంత జీతం పెరుగుతుంది?

Telangana DA Hike: నిన్న జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క డీఏను చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఇన్ని నెలలుగా ఐదు బకాయిల కోసం ఎదురు చూస్తున్న తమకు కనీసం మూడు అయినా చెల్లిస్తారని అనుకున్నాం. కానీ, కేవలం ఒక్క డీఏతో ఎలా సరిపెట్టుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం ఈ తీరుపై మరోసారి సమీక్షించుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పెరిగిన డీఏతో ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది తెలుసుకుందాం.
 

1 /9

తెలంగాణ ఉద్యోగులకు మొత్తంగా ఐదు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు ఇస్తామని చెప్పారు. కానీ, నిన్నటి కేబినెట్‌ మీటింగ్‌లో కేవలం ఒక్క బకాయికి మాత్రమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.   

2 /9

ఒకరి నెలవారీ బేసిక్‌ జీతం రూ.19000 ఉంటే డీఏ రూ.4323 అందుకుంటారు పెరిగిన 3.64 శాతం డీఏ రూ.692 పెరిగింది. మొత్తం డీఏ రూ.5,014 అవుతుంది.  

3 /9

ఉద్యోగి బేసిక్ జీతం ఒక వేళ రూ.20,280 అయితే, రూ.4468 డీఏ ఉంటుంది. రూ.738 పెరుగుదలతో మొత్తం డీఏ రూ. 5,206 అవుతుంది.  

4 /9

బేసిక్‌ జీతం రూ.42,300 ఉంటే డీఏ రూ.9623 ఉంది.రూ.1540 పెరుగుదలతో రూ.11,163 అవుతుంది.  

5 /9

జీతం రూ.58,850 డీఏ రూ.13,388 ఉండగా, మొత్తం పెరిగిన డీఏ రూ.2142 తో రూ.15530 పెరగనుంది.  

6 /9

ఒకవేళ ఉద్యోగి బేసిక్‌ జీతం రూ.158380 ఉంటే వారి డీఏ రూ.36031 ఉంది. మొత్తం రూ.5765 పెరుగుదలతో రూ.41796 అవుతుంది.  

7 /9

డీఏ పెంపుపై ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి.. ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని వినతి.. ఇదిలా ఉండగా ఐదు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక్క బకాయి మాత్రమే ఇవ్వడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది.

8 /9

అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు మూడు చెల్లిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ప్రస్తుతం కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం ఏంటని ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలని ఉద్యోగులు అంటున్నారు.  

9 /9

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కనీసం రెండు డీఏలైన దీపావళి పండుగ ముందుగా ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ, ప్రభుత్వం కేవలం ఒక్క డీఏ బకాయి మాత్రమే విడుదలపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.