Valentine's Day Gift Astrology: వాలెంటైన్స్ డే రోజు పొరపాటున ఈ గిఫ్ట్‌ ఇచ్చారో మీరు బ్రేకప్ చెప్పుకోవల్సిందేనట..!

Valentine's Day Gift Astrology: ప్రేమికులరోజు ప్రతిఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతకు ఒక వారం ముందు అంటే ఫిబ్రవరి 7 నుంచి వారం రోజుల పాటు రోజ్ డే, ప్రపోజ్ డే ,ఇతర ప్రత్యేక రోజులను వారానికి ఏడు రోజులు జరుపుకుంటారు. ఆ తర్వాత కూడా ప్రత్యేకమే స్లాప్ డే, కిక్ డే వంటివి ఉంటాయి. అయితే ఈ సమయంలో ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. 
 

1 /6

Valentine's Day Gift: వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్యం ప్రకారం ప్రేమికుల రోజున కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. వీటిని బహుమతిగా ఇవ్వడం వల్ల రిలేషన్ షిప్ బ్రేకప్ అవుతుందని అంటున్నారు. 

2 /6

గడియారం.. ప్రేమికుల రోజున మీ ప్రేమికుడికి వాచ్‌ని బహుమతిగా ఇవ్వడం మానుకోండి. ఒక వాచ్‌ను బహుమతిగా ఇవ్వడం వల్ల కెరీర్, వ్యాపారం, ఉద్యోగాలలో పురోగతి మందగిస్తుంది. అంతే కాదు మీ రిలేషన్ షిప్ లో పగ పెంచుతుందని అంటున్నారు. 

3 /6

చెప్పులు.. వాలెంటైన్స్ డే సందర్భంగా కొంతమంది తమ ప్రేమికుడికి డి షూస్, స్లిప్పర్లను బహుమతిగా ఇస్తుంటారు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం, వీటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీని వల్ల రిలేషన్ షిప్ లో గొడవలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

4 /6

నల్లని వస్తువులు.. హిందూ మతంలో ఏదైనా నల్ల వస్తువులను బహుమతిగా ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడదు. కాబట్టి మీ వాలెంటైన్‌కు నల్లటి దుస్తులను బహుమతిగా ఇవ్వడం మానుకోండి. 

5 /6

కర్చీఫ్.. కొంతమంది తాము ఉపయోగించిన వస్తువులను వారి భాగస్వామికి బహుమతిగా ఇవ్వడానికి ఇష్టపడతారు. మరికొందరు రుమాలుపై ప్రత్యేకంగా కుట్టుపని చేసి బహుమతిగా ఇస్తారు. అయితే, ఇవి ఇవ్వడం వల్ల త్వరలోనే బ్రేకప్ అవుతుందట. 

6 /6

పరిమళ ద్రవ్యాలు.. పరిమళం అద్బుతమైన సువాసన. అయితే, దానిని వేరొకరికి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి/ప్రేమికుడికి బహుమతిగా ఇవ్వడం ఒకరికొకరు దూరాన్ని ఏర్పరుస్తుంది.