Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తీసుకోవాల్సిందే!!

Foods For Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. 

Foods For Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కేవలం పాలు మాత్రమే కాకుండా కొన్ని ఆహారపదార్థాల్లో కూడా ఎముకల ఆరోగ్యానికి సహాయపడే పోషకాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

1 /9

పాలు- పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్, చీజ్ వంటివి క్యాల్షియంకు మంచి మూలాలు.  

2 /9

ఆకు కూరలు: పాలకు, బచ్చలికూర, కాలే, ముల్లంగి ఆకులు వంటివి క్యాల్షియంతో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తాయి.  

3 /9

బీన్స్- గింజలు: చిక్కెడు, బాదం, వాల్నట్స్ వంటివి క్యాల్షియంతో పాటు మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలను కూడా అందిస్తాయి.

4 /9

టోఫు: సోయాబీన్స్ నుంచి తయారు చేసే టోఫు కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎలాంటి కీళ్ళ నొప్పులు కలగకుండా ఉంటాయి.   

5 /9

చేపలు: సాల్మన్, ట్యూనా వంటి చేపలు విటమిన్ డికి అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. 

6 /9

  తృణధాన్యాలు: బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలు కూడా విటమిన్ డిని అందిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి. 

7 /9

విత్తనాలు: చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఓమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం వంటి ఖనిజాలను అందిస్తాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

8 /9

సూర్యరశ్మి: విటమిన్ డిని శరీరం సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకుంటుంది. కాబట్టి రోజుకు కొంత సమయం సూర్యరశ్మిని తీసుకోవడం చాలా ముఖ్యం.

9 /9

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్ ని  సంప్రదించాలి.