Shani Dev Blessings: శని దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావిస్తారు. అందుకే చెడు దృష్టి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని శుభదృష్టి వల్ల మంచి జరుగుతుంది, అశుభ దృష్టి వల్ల జీవితంలో చెడు జరుగుతుంది. పనులు పెండింగ్లో పడిపోతాయి ఏ పనులు ముందుకు సాగవు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. శని దేవుడు ఒక్కో రాశికి ఒక్కో విధంగా జీవితంలో ప్రభావితం చూపుతాడు.
కొంతమందికి శుభం, మరికొంతమందిపై శని అశుభ ప్రభావం ఉంటుంది.. ఇది వారి జన్మ కుండలి, గ్రహాల స్థానం, కర్మలను బట్టి జరుగుతుంది. అయితే శని చెడు దృష్టి నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి నిపుణులు చెప్పిన ఆ మార్గాలు ఏంటో తెలుసుకుందాం.
శని తో బాధపడే వారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాలని పండితులు చెబుతారు. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి, నవగ్రహలా ప్రదక్షిణలు చేసినా శని బాధల నుంచి బయటపడవచ్చని పండితులు సూచిస్తారు. ఇలా చేయడం వల్ల శని నుంచి కాసింత ఉపశమనం లభిస్తుంది.
వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామికి పూజించే వారిని శని వేధించడని నమ్ముతారు. అంతేకాదు శివుడి పూజ కూడా శని భక్తులను కూడా శని వేధించాడు.మీ పైన శని కృప అపారంగా ఉండాలంటే శనివారం రోజు నల్లని లేదా నీలం రంగు దుస్తులను ధరించాలి. అంతేకాదు శని వల్లే పీడితులు అవుతున్న వారు శనివారం ఉపవాసం పాటించాలి.
ఇలా చేయడం వల్ల శని అశుభ దృష్టి నుంచి త్వరగా బయటపడవచ్చు. అంతేకాదు ఈరోజు పేదవారికి భోజనం పెట్టాలి శనివారం పూట నవగ్రహలకు, శని దేవుడికి ఆవనూనెతో అభిషేకం చేయాలి. నల్ల నువ్వులు సమర్పించాలి. ఈరోజు పెద్దవారిని అవమానించకూడదు. రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం ఆనవాయితీ కూడా ఉంది శనివారం ఇలా చేయటం వల్ల బయటపడతారు.
శనివారం మూగ జీవాలకు ఆహారం పెట్టాలి. ఈరోజు పేదవారికి దానం చేయాలి కాకికి భోజనం పెట్టి ఆనవాయితీ కూడా ఉంది అంతేకాదు నల్ల కుక్క కూడా రొట్టె తినిపిస్తారు. ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల కూడా శని అశుభ అదృష్టం నుంచి బయటపడతారు