Tollywood heroes vs Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి స్వయంకృషితో ఎదిగి నేడు.. మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. ఆరు పదుల వయసు.. దాటినా సరే అదే ఎనర్జిటిక్ తో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ లో రికార్డు సంపాదించుకున్నారు ఈ హీరో.
తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికినటువంటి ఆణిముత్యాలలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంకృషితో ఎదిగే నేడు మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు.
ముఖ్యంగా చాలామంది హీరోలు.. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని.. నేడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో శ్రీకాంత్, నాచురల్ స్టార్ నాని ఇలాంటి ఎంతోమంది హీరోలు చిరంజీవిని ఇన్స్పైర్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే.
ఇదిలా ఉండగా తాజాగా ఆరు పదుల వయసులో సినిమాల పరంగా వెనుకబడిన కానీ చిరంజీవి అరుదైన రికార్డులను మాత్రం సొంతం.. చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తన సినీ కెరియర్లో 153 కు పైగా చిత్రాలలో నటించిన చిరంజీవి.. ఆ సినిమాలలో 537 పాటలు, 24 వేల స్టెప్పులతో చరిత్ర సృష్టించారని చెప్పాలి. ఇక చిరంజీవి క్రియేట్ చేసిన ఈ రికార్డుకి గిన్నిస్ కూడా ఫిదా అయిపోయింది. దీంతో గిన్నిస్ రికార్డుల్లో చిరంజీవికి స్థానం కల్పించింది.
చిరంజీవి గిన్నిస్ రికార్డు గురించి పలువురు మెగా హీరోలు ఇప్పటికే స్పందించారు. కానీ ఇతర ఫ్యామిలీలో స్టార్ హీరోల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన అయితే రావడం లేదని..చెప్పవచ్చు. ముఖ్యంగా చిరంజీవికి గిన్నిస్ రావడం వారికి సహించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే చిరంజీవి కొంతమంది హీరోలను తొక్కేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో వీటి గురించి అంత చర్చ జరగకపోయినా.. ప్రస్తుతం మాత్రం ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని ఎదిరించడానికి ఎవరు సాహసం చేయలేదని… కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది టాలీవుడ్ హీరోలు చిరంజీవిని కొంచెం పక్కన పెట్టడానికి చూస్తున్నారు అనే రూమర్ కూడా వినిపిస్తోంది.
ముఖ్యంగా హీరోలు ఇలా సైలెంట్ గా ఉండడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితులు కూడా మారుతున్నాయి అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కనీసం ఒక్క ట్వీట్ వేస్తే నష్టం ఏంటని మెగా అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. గిన్నిస్ బుక్ లో రికార్డు సంపాదించుకోవడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. అందులోనూ ఆరుపదుల వయసు దాటిన తర్వాత అలాంటి రికార్డులు అంటే నిజంగా ఆశ్చర్యం అనే చెప్పాలి. మొత్తానికైతే టైర్ - 1 హీరోలు చిరంజీవి ఘనత విషయంలో.. సైలెన్స్ మైంటైన్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..