Sitara Donation: ఆ స్టార్ కిడ్ 12 ఏళ్ల ప్రాయంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంది. తాను చేసిన పనితో కుటుంబం ఖ్యాతి పెంచేసింది. ఏళ్ల తరబడి కష్టపడినా సంపాందించలేనంత మొదటి సంపాదనను తృణప్రాయంగా ఆనందంగా విరాళమిచ్చేసింది. అందుకే ఈ స్టార్ కిడ్ ఇప్పుడు వార్తల్లో ఉంది. ఇంతకీ ఆ స్టార్ కిడ్ మరెవరో కాదు..సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితారకు ఇప్పుడు 12 ఏళ్లు వచ్చాయి. తల్లిదండ్రులు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు.
పీఎంజే బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఫోటోలు ఎంతగా ప్రాచుర్యం పొందాయో అంతకంటే ఎక్కువగా ఆమె జీతం వార్తల్లోకెక్కింది. పీఎంజే ప్రకటనలకు ఆమె తొలి సంపాదన ఏకంగా 1 కోటి రూపాయలు. ఇప్పుడీమె తన తొలి సంపాదన కోటి రూపాయల్ని విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
పీఎంజే బ్రాండ్ అంబాసిడర్ గా సితార ఫోటోలు కొన్ని టైమ్స్ స్క్వేర్ పై కూడా ప్రదర్శితమయ్యాయి. ఈ ఖ్యాతి దక్కించుకున్న తొలి అతి చిన్న స్టార్ కిడ్.
పీఎంకే బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అంతే ఆమె కీర్తి పతాక స్థాయికి చేరుకుంది. సితార పీఎంజే ప్రకటనలో కన్పించిన లుక్స్ అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.
సితార బాల్యం నుంచే ట్యాలెంటెడ్ అమ్మాయి. 11 ఏళ్ల నుంచే పని చేయడం ప్రారంభించింది. సితార గత ఏడాది ప్రముఖ జ్యూవెల్లరీ బ్రాండ్ పీఎంజేకు చెందిన ప్రిన్సెస్ షార్ట్ ఫిల్మ్ లో నటించింది.
మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ లకు ఇద్దరు పిల్లలు. కొడుకు గౌతమ్ కాగా కుమార్తె సితార. ఇద్దరికీ ఆరేళ్లు తేడా ఉంది. గౌతమ్ కంటే సితార ఆరేళ్లు చిన్నది. సితార ఇప్పుడు చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 5వ తరగతి చదువుతోంది.
ఈ మధ్యనే సితార అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకలో సెలెబ్రిటీలతో సెల్ఫీలు దిగుతూ హలా్ చల్ చేసింది.