Top EV Cars in 2023: బడ్జెట్, లగ్జరీ విభాగాల్లో టాప్ 7 ఈవీ కార్లు, వాటి ధరలు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. ఒకదాన్ని మించి ఒకటిగా కంపెనీలు ఈవీ కార్లు ప్రవేశపెడుతున్నాయి. 2023లో చాలా ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లో వచ్చాయి. బడ్జెట్‌పరంగా, లగ్జరీపరంగా చాలా కార్లు అందుబాటులో ున్నాయి. అందులో టాప్ ఈవీ కార్ల గురించి పరిశీలిద్దాం..

Top EV Cars in 2023: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. ఒకదాన్ని మించి ఒకటిగా కంపెనీలు ఈవీ కార్లు ప్రవేశపెడుతున్నాయి. 2023లో చాలా ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లో వచ్చాయి. బడ్జెట్‌పరంగా, లగ్జరీపరంగా చాలా కార్లు అందుబాటులో ున్నాయి. అందులో టాప్ ఈవీ కార్ల గురించి పరిశీలిద్దాం..

1 /7

Mercedes Benz EQE ఈ కారును డిసెంబర్ 2023లో లాంచ్ చేశారు. ఈ కారు ధర 1.39 కోట్ల రూపాయలు. ఇందులో 90.6 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పుల్ చార్జ్ చేస్తే 550 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 

2 /7

Audi Q8 e-tron ఆడి క్యూ8 55 ఈ ట్రాన్, ఆడి క్యూ8 స్పోర్ట్ బ్యాక్ 55 ఈ ట్రాన్ రెండూ 114 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉన్నాయి. దీని ధర 1.13 కోట్ల నుంచి 1.30 కోట్ల వరకూ ఉంది. 

3 /7

BMW iX1 థర్డ్ జనరేషన్ ఎక్స్ 1 ఆధారిత కారు ఇది. ఇండియాలో 66.90 లక్షలకు లాంచ్ అయింది. ఇది పూర్తిగా సీబీయూ మోడల్ కారు. ఇందులో 66.4 కిలోవాట్స్ బ్యాటరీ ఉంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 440 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 

4 /7

Hyundai Ioniq 5 ఇండియాలో ఈ కారు సీకేడీగా లభ్యమౌతోంది. ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ కారు. 72.6 కిలోవాట్స్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు ధర 44.95 లక్షలుంది. 

5 /7

Mahindra XUV400 ఇది కూడా 2023లోనే లాంచ్ అయింది. ఈ కారు ధర 16 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 34.5 కిలోవాట్స్ కాగా రెండవది 39.4 కిలోవాట్స్.

6 /7

Citroen eC3 ఈ కారు ఫిబ్రవరి 2023లో లాంచ్ అయింది. ఇది సి3 ఆాదారిత ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ధర 11.50 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో 29.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌పై 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 

7 /7

MG Comet EV మే 2023లో పంకీ, అల్ట్రా కోమెట్ ఈవీ లాంచ్ అయింది. ఈ కారు ధర 7.98 లక్షల నుంచి 9.98 లక్షల్లో ఉంది. దీంట్లో 17.3 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌పై 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.