Trisha: మరోసారి ప్రభాస్ సినిమాలో కనిపించనున్న త్రిష.. ఇంతకీ ఏ సినిమాలో అంటే..!

Spirit Update: ప్రభాస్, త్రిష జోడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ని స్టార్ హీరోగా నిలబెట్టిన వర్షం సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ త్రిష. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో కనిపించి.. మెప్పించారు. తాజాగా ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి.. ఒక సినిమాలో కనిపించనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

1 /5

త్రిష గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది త్రిష. ఒక అయిదారు సంవత్సరాల ముందు వరకు.. స్టార్ హీరోయిన్స్ అంటే త్రిష పేరు ముందంజలో ఉండేది. 

2 /5

కాగా కొద్ది రోజుల నుంచి మాత్రం తెలుగులో.. త్రిషకి పెద్దగా ఆఫర్లు లేవు. తమిళంలో మాత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్.. సినిమాతో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకుంది ఈ హీరోయిన్. ఆ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించడంతో.. త్రిష కి మళ్లీ వలస అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.

3 /5

అదే టైంలో తెలుగులో కూడా చిరంజీవితో విశ్వంభర.. చిత్రంలో అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్.. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి విశ్వంభర చిత్రంతో పాటు.. తమిళంలో కూడా కొన్ని సినిమాలు అంగీకరించింది. మరోపక్క వెబ్ సిరీస్ లో సైతం కనిపిస్తూ మెప్పిస్తోంది.   

4 /5

ఈ మధ్యనే త్రిష మెయిన్ రోల్ లో వచ్చిన బృందా వెబ్ సిరీస్.. సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతూ మంచి ఆదరణ తెచ్చుకుంటోంది. దీంతో త్రిషకి.. ఓటిటిలో కూడా డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో త్రిష గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

5 /5

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వస్తోన్న స్పిరిట్ సినిమాలో.. త్రిష ఒక ముఖ్య పాత్రలో కనిపించనుందట. ప్రభాస్, త్రిష జంటగా.. వర్షం, పౌర్ణమి బుజ్జిగాడు మ..వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సూపర్ హిట్ జోడి స్పిరిట్ సినిమా కోసం కలవనున్నారని వినికిడి.  ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలి అంతే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.