TTD NEWS: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రూ. 300 ల దర్శన టికెట్లు విడుదల.. ఆ రోజే ఆర్జిత సేవా టికెట్లు..

Tirumala Rs 300 Darshan Tickets: తిరుమలలో సెప్టెంబర్ మాసంలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులకు గాను.. రూ. 300  ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఈరోజు(సోమవారం) విడుదల చేసింది. 

1 /6

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని చాలా మంది దర్శించుకొవాలని ప్రతిఒక్కరు పరితపిస్తుంటారు. కొన్నినెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలయంలోనే అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోతున్నాయి. దర్శనం కోసం రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం పడుతుంది.

2 /6

ఇక లైన్ లో ఉండలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్ లో  ఉన్నవారికి సరైన సదుపాయాలు లేవని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఇటీవల ప్రభుత్వం మారింది. ఇటీవల సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిచారు.దీనిలో భాగంగా గత ఈవోను తొలగించి శ్యామల రావుకు బాధ్యతలు అప్పగించారు.

3 /6

ఆయన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల శ్రీవారి  1200 మెట్ల మార్గంలో మరల సర్వదర్శనం స్కానింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. క్యూలైన్ లో ఉన్న వారికి స్వామి వారి ప్రసాదం, మజ్జిగ వంటివి తిరిగి ఇవ్వడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

4 /6

ఈనేపథ్యంలో టీటీడీ సెప్టెంబర్ మాసం నాటికి గాను.. రూ. 300 టికెట్లను విడుదల చేసింది. అంతేకాదు తిరుమల, తిరుపతిల‌లో సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మరోవైపు ఈ నెల 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి స్పెషల్ ఆర్జిత సేవా కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. 

5 /6

దీనితో పాటు..న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు దర్శన టికెట్లు, వసతి గదులు, సేవా కోటాను బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

6 /6

తిరుమల శ్రీవారిని దర్శనంచేసుకొవాలనుకునే భక్తులు.. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో సూచించింది.