Saranya sasi died of cancer, Saranya sai latest photos gallery: గత పదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో (Brain tumuor) పోరాడుతున్న మళయాళం నటి శరణ్య శశి సోమవారం మృతిచెందారు. మళయాళం టీవీ సీరియల్స్, సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన నటిగా (Malayalam tv actress Saranya sasi) పేరు తెచ్చుకున్న శరణ్య శశికి ఇప్పటివరకు 11 మేజర్ సర్జరీలు జరిగాయి.
Saranya sasi died of cancer, Saranya sai latest photos gallery: గత పదేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో (Brain tumuor) పోరాడుతున్న మళయాళం నటి శరణ్య శశి సోమవారం మృతిచెందారు. ఆమె వయస్సు 35 ఏళ్లే. మళయాళం టీవీ సీరియల్స్, సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన నటిగా (Malayalam tv actress Saranya sasi) పేరు తెచ్చుకున్న శరణ్య శశికి ఇప్పటివరకు 11 మేజర్ సర్జరీలు జరిగాయి. (Image credits: Twitter photo)
ఇటీవలే కరోనావైరస్ (Coronavirus) బారిన పడిన శరణ్య శశి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఆమె పూర్తిగా కోలుకుంటున్నారు అనుకుంటున్న సమయంలోనే ఆమె మరోసారి ఆస్పత్రిపాలయ్యారు. (Image credits: Twitter photo)
రక్తంలో సోడియం లెవెల్స్ పడిపోవడం (low sodium levels in blood), న్యూమోనియా కారణంగా ఆమె ఈసారి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. (Image credits: Twitter photo)
ఆ సమస్యలతోనే చికిత్స పొందుతూ ఆగస్టు 9 సోమవారం.. అంటే ఇవాళ మధ్యాహ్నం సమయంలో త్రివేండ్రంలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. (Image credits: Twitter photo)
శరణ్య శశి 2012లో క్యాన్సర్ (Cancer) బారిన పడినట్టు తొలిసారిగా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు 11 శస్త్రచికిత్సలు జరిగాయి. చికిత్స కొనసాగుతూనే (Cancer treatment in India) ఉంది. (Image credits: Twitter photo)
క్యాన్సర్ చికిత్స కారణంగా శరణ్య శశి ఆర్థికంగా బాగా చితికిపోయింది (TV Actress Saranya Sasi financial crisis). శరణ్య శశి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, మిత్రులు ఆమెకు తమకు చేతనైన సహాయం చేస్తూ వచ్చారు. మంత్రకోడి, హరిచందనం, సీత (Manthrakodi, Harichandanam, Seetha) వంటి పాపులర్ టీవీ సీరియల్స్ శరణ్య శశికి బాగా పేరు తెచ్చిపెట్టాయి. (Image credits: Twitter photo)
అలాగే చోట ముంబై, తలప్పవు, బాంబే, చాకో రందమన్ (Chotta Mumbai, Thalappavu, Bombay, Chacko Randaman) వంటి సినిమాల్లో శశి పోషించిన పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. (Image credits: Twitter photo)
శరణ్య శశి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆ కుటుంబానికి ఓదార్పు సందేశం పంపిన కేరళ సీఎం పినరయి విజయన్. (Image credits: Twitter photo)