Varahi Ammavaru: అసలు వారాహీ అమ్మవారు ఎవరు..? వారాహీ నవరాత్రులు ప్రత్యేకత ఇదే.. ?

Varahi Ammavaru: సాధారణ ప్రజానీకానికీ నవరాత్రులు అంటే శరన్నవరాత్రులే గుర్తుకు వస్తాయి. అశ్వీయుజ మాసములో విజయ దశమికి ముందు తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉగాది నవరాత్రులు.. వినాయక నవరాత్రులు.. ఆషాఢ మాస నవరాత్రులు.. ఇందులో ఆషాడం మాసంలో జరుపుకునే నవరాత్రులనే వారాహీ నవరాత్రులుగా జరుపుకుంటాము.

1 /11

Varahi Ammavaru: ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహీ అమ్మవారి నవరాత్రులను ‘గుప్త నవరాత్రులని.. గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు. వీటితో పాటు వారాహీ నవరాత్రి, శాకంబరి నవరాత్రి పేరిట పిలుస్తుంటారు. ఈ సారి వారాహీ నవరాత్రులు.. ఆషాడ మాస ప్రారంభం నుండి అనగా... జులై 6 శనివారం 2024న ప్రారంభమై జులై 15 సోమవారం 2024న ముగుస్తాయి.  

2 /11

ఈ నవ రాత్రులు శాక్తేయం అనుసరణ లో ఉన్న  అమ్మవారి ఆలయాల్లోను జరుపుతుంటారు. గురు ముఖతః సప్తమాతృకా లేదా అష్ట మాతృకా మంత్ర విద్యలు స్వీకరించి అనుష్టించే వారు  ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవ సమయంలో పాటించే అచారాలన్నీ దీనికి కూడా పాటిస్తారు.

3 /11

వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి  లేదా దండనాథ దేవి. ఈ అమ్మవారు వరాహ తలను కలిగి ఉంటుంది.  ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన, నవావరణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తారు. దుర్గా సూక్తం, లలితా సహస్ర నామం, లలితోపాఖ్యానం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేయడం ఆచారంగా వస్తోంది.

4 /11

గుప్త నవరాత్రి / గుహ్య నవరాత్రి ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవి భాగవతం, దుర్గా సప్తశతి / దేవి మహత్యం లాంటివి పారాయణం చేయటం శుభాలను కలిగిస్తుందని భక్తుల నమ్మకం. తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా...  శాంతికరణం, వశీకరణం, ఉఛ్ఛాటనం, స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యలను సాధన చేస్తారు.

5 /11

ఉగ్రవారాహీ అమ్మవారి దేవాలయం, వారణాసి   కాశీలో ఉగ్ర వారాహీ విచిత్ర దేవాలయం ఉన్నది. భూ గృహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ అందులో ప్రవేశం (భూగృహం)లోకి ప్రవేశం ఉండదు.  ఉదయం 8  గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్లనీయరు. పై భాగంలో ఉన్న రెండు కన్నాల నుంచి ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూసి తరించగలం. కేవలం అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలుగుతాము.

6 /11

రాత్రివేళల్లో పూజలందుకునే వారాహిదేవత' మన పురాణాలు  ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరుపాలే సప్తమాతృకలు. 1 బ్రాహ్మి 2 మహేశ్వరీ 3 కౌమారి 4 వైష్ణవి 5 వారాహి 6 ఇంద్రాణి 7 చాముండి.

7 /11

కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకి ని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు.  వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు.

8 /11

'వరాహుని స్త్రీతత్వమే వారాహి'   శ్రీ వరాహస్వామి వారి స్త్రీతత్వముగా వారాహీ తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి. మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వరాహస్వామికి తల్లి గా ప్రకటితమవుతుంది. ఇవి మంత్రార్ధ రహస్యములుగా సాధకులు గ్రహించాలి.  అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము. భారతీయ సనాతన ఆరాధనా పద్ధతులలో.. నామ రూప గుణ తత్వ వైభవములుగా ఆయా మంత్రాధి దేవతలు ప్రకటితమవుతూ ఉంటారు.

9 /11

అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానాలలో మడి, ఆచారం, కట్టు బాట్లు, సమయం, ప్రత్యేక పూజలు, నివేదనలు, హోమాలు, తంత్రాలు, మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది.

10 /11

పూర్వం హిరాణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భులోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహా పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహీ - 'కాశీ' వారాహిదేవి  అమ్మవారి పాత్ర సుస్పష్టము.

11 /11

వారాహి రూపం ఇంచు మించు వరాహ మూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘ వర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశము, హలము, వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము,దున్నపోతు వంటి వివిధ వాహానాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు.