Venkatesh: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా..

Venkatesh New Movie: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ ఈ యేడాది సంక్రాంతికి 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా వెంకీ మామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

1 /6

రీసెంట్ గా వెంకటేష్ తన కెరీర్ లో లాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందనుకున్న ‘సైంధవ్' మూవీ సంక్రాంతి పోటీలో నలిగిపోయింది. ఈ సినిమా తర్వాత తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

2 /6

ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు శిరీష్,అనిల్ రావిపూడితో పాటు వెంకటేష్ సోదరుడు నిర్మాత సురేశ్ బాబు, కే.రాఘవేంద్రరావు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

3 /6

ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో సినిమా స్క్రిప్ట్ ను వంశీ పైడిపల్లి దర్శకుడు అనిల్ రావిపూడికి అందజేశారు.

4 /6

అంతేకాదు వెంకటేష్, మీనాక్షి చౌదరిలపై తొలి సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.

5 /6

డి.సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్  చేస్తే.. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

6 /6

అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాలో చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు పెళ్లాల మధ్య నలిగే పోలీస్  భర్త పాత్రలో కనిపించనున్నాడట. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.