Rashmika Mandanna engagement: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ జంటలుగా కొనసాగుతున్న వారిలో విజయ్ దేవరకొండ రష్మిక కూడా ఒకరు ఇప్పటికే ఎన్నోసార్లు హింట్ ఇచ్చినా ఇంకా బహిర్గతం కాలేదు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ..అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయిన ఈయన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.దాంతో సరైన కథ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా మరొకవైపు రష్మిక కూడా తనదైన నటనతో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయింది. ఇటీవల వచ్చిన పుష్ప 2 సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రష్మిక.
ఇదిలా ఉండగా వీరిద్దరూ గీతాగోవిందం సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు గత కొన్ని రోజులుగా వెకేషన్స్ కి వెళ్లడం విజయ్ దేవరకొండ తన వాడు అన్నట్టుగా అందరితో మాట్లాడుతోంది రష్మిక. అటు విజయ్ దేవరకొండ నేనింకా సింగల్ గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా అంటూ కామెంట్లు చేశారు.
ఇక అలా మొత్తానికి అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈనెల రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని మరో ఆరు నెలల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇక ఇదే జరిగితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.