Pushpa 2: ఇదేంపైత్యం రా నాయన.. ‘పుష్ప-శ్రీవల్లీ’ వినాయకుడంటా.. చూశారా..?

Vinayaka Chaturthi 2024: వినాయక చతుర్థి పండగకు సందడి మొదలైంది. ఎక్కడ చూసిన కూడా గణేషుడి మండపాలను రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన  గణపయ్య చతుర్థిని వేడుకగా జరుపుకుంటాం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో పుష్ఫ 2 శ్రీవల్లీ వినాయకుడి విగ్రహాం ప్రస్తుతం వైరల్గా మారింది.
 

1 /6

ప్రతి ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను ప్రజంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న వినాయక చతుర్థి ఉత్సవాలను నిర్వహించనున్నారు. కొంత మంది 3 రోజులు, మరికొందరు 5 రోజులు, 11 రోజులు కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ఎక్కడ చూసిన కూడా వినాయకుడి విగ్రహాలు సందడి చేస్తున్నాయి.  

2 /6

ఇటీవల కాలంలో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఏడాది వినాయకుడ్ని తయారు చేసేటప్పుడు.. ఆ సమయంలో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలలోని హీరోలు, సినిమా థీమ్ తో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈసారి పుష్ప2 థీమ్ తో గణపయ్యలను తయారు చేశారు.

3 /6

ముంబైలోని పలు ప్రాంతాలలో పుష్ప2 థీమ్ తో..గణపయ్యలను తయారు చేశారు . ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి అంటూ ఫైర్ అవుతున్నారు.

4 /6

పుష్ప2 మూవీలో.. అల్లుఅర్జున్ తగ్గెదెలా.. అన్న థీమ్ లో కూడా.. గణపయ్యను కూడా తయారు చేశారు. అంతేకాకుండా.. ఈసారి వెరైటీగా ‘పుష్ప-శ్రీవల్లీ’.. థీమ్లో గణేషుడిని తయారు చేశారు. ప్రస్తుతం ఇదివైరల్ గా మారింది.   

5 /6

మరోవైపు దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్తున్నారు. అంతేకాకుండా.. పీఓపీతో తయారు చేసిన గణపయ్యలను ఉపయోగించకుండా.. మట్టి వినాయకుల్ని కొనాలని చెప్తుంటారు.

6 /6

పండితులు కూడా ఇలాంటి విధంగా గణపయ్యలను తయారు చేసి.. దేవుడ్ని అవమానపర్చే విధంగా చేయోద్దని కూడా చెబుతున్నారు. ఇలాంటి విగ్రహాలను చూస్తే.. దేవుడిలాగా ఎలా అనిపిస్తుందని కూడా.. కొంత మంది మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇది వివాదాదస్పదంగా మారింది.