Vivo X100 Pro Price: Vivo నుంచి గుడ్‌ న్యూస్‌..ప్రీమియం ఫీచర్స్‌తో మరో 2 మొబైల్స్‌..ధర, విడుదల తేది వివరాలు!

Vivo X100 Launch Date: మార్కెట్‌లోకి త్వరలోనే వీవో మరో రెండు స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్స్‌ను వీవో ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే..అయితే త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదల చేయబోతోంది. 

  • Dec 27, 2023, 17:42 PM IST

vivo x100 pro price in india flipkart: ప్రముఖ టెక్‌ కంపెనీ వీవో(Vivo) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్స్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

1 /6

Vivo నుంచి విడుదల కాబోయే మొబైల్స్‌ X100 సిరీస్‌లో విడుదల కాబోతున్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన విడుదల తేదిని ఇటీవలే ప్రకటించింది. అధికారిక వివరాల ప్రకారం ఈ Vivo X100 మొబైల్స్‌ జనవరి 4న మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.  

2 /6

ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌ ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌ట్రైల్ బ్లూ, సన్‌సెట్ కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఈ మొబైల్స్‌ MediaTek Dimensity 9300 ప్రాసెసర్‌పై పని చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

3 /6

ఈ Vivo X100, Vivo X100 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ ఎంతో శక్తివంతమైన Funtouch OS 14పై రన్‌ కాబోతున్నాయి. ఇక ఈ మొబైల్స్‌  6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ల్పేను కలిగి ఉంటాయి. ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతోంది.    

4 /6

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఈ కెమెరాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయని ప్రముఖ టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి విడుదలైతే యాపిల్ 15తో పోటీ పడే ఛాన్స్‌ ఉంది. 

5 /6

వీవో ఇప్పటికే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ను చైనాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం మొబైల్‌ చైనా మార్కెట్‌లో  CNY 4,999తో అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ మొబైల్‌ రూ. 56,500లోపే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

6 /6

ఇక హై ఎండ్‌  Vivo X100 సీరిస్‌ మొబైల్‌ ధర విషయానికొస్తే..చైనా మార్కెట్‌లో రూ. 60 వేలలోపే లభిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ భారత మార్కెట్‌లో విడుదలై చైనా మార్కెట్‌లో ఉండే ధర కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి.