Vivo X200 Series: వీవోనా మాజకా.. దిమ్మతిరిగే ఫీచర్స్‌తో Vivo X200 సిరీస్‌ వస్తోంది.. లాంచ్‌కి ముందే ఫీచర్స్‌ లీక్‌!


Vivo X200 Series Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వీవో మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 
 

Vivo X200 Series Launch Date And Price In India: ప్రముఖ టెక్‌ కంపెనీ Vivo మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. దీనిని కంపెనీ Vivo X200 సిరీస్ పేరుతో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్‌ను కంపెనీ అక్టోబర్‌ 14వ తేదిన చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. 

1 /7

వీవో కంపెనీ ఈ సిరీస్‌ను  Vivo X200, Vivo X200 Proతో పాటు Vivo X200 అల్ట్రా మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఇందులోని టాప్‌ మోడల్‌ అల్ట్రాకి సంబంధించిన ఫీచర్స్‌ ఇటీవలే లీక్‌ అయ్యాయి. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

2 /7

ఈ Vivo X200 Ultra మోడల్‌ను కంపెనీ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దీనిని 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన క్వాడ్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది. 

3 /7

ఇక Vivo X200తో పాటు Vivo X200 Pro వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్స్‌ ఎంతో పవర్‌ఫుల్‌ MediaTek Dimension 9400 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇక కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్‌ సెటప్‌లో మూడు 50-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ప్రధాన కెమెరాలను కూడా కలిగి ఉంటుంది.  

4 /7

అంతేకాకుండా Vivo X200 Ultra స్మార్ట్‌ఫోన్‌లోని ప్రధాన కెమెరా 'ఫిక్స్‌డ్ లార్జ్ ఎపర్చర్' ఫీచర్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఎలాంటి సబ్జెట్‌నైనా ప్రీమియం లుక్‌లో కనిపించేలా ఫోటోస్‌ తీయోచ్చు. అంతేకాకుండా ఇందులో ఫోటోస్‌తో పాటు వీడియోలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి. 

5 /7

ఇక లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ సిరీస్‌లోని అల్ట్రా మోడల్‌ మాత్రం 6000mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు మోడల్స్‌ 5800mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌ను కంపెనీ అక్టోబర్ 14న చైనాలో అధికారికంగా విడుదల చేయబోతునట్లు కంపెనీ వెల్లడించింది.  

6 /7

వీవో కంపెనీ  Vivo X100 సిరీస్‌ను మే నెలలోని చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది మార్కెట్‌లో ధర సుమారు రూ. 74,500 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన 6.78-అంగుళాల 2K (1440x3200 పిక్సెల్‌లు)తో అందుబాటులోకి రానుంది.

7 /7

అంతేకాకుండా ఈ మోడల్‌  స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో లభిస్తోంది. ఇక ఇది 5500mAh బ్యాటరీతో పాటు  30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి రానుంది.