HBD Ananya Nagalla: తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అనన్య నాగళ్ల ..

Ananya Nagalla:  అనన్య నాగళ్ల .. పదహారాణాల అచ్చ తెలుగు భామ. అందుకే ఈమెకు టాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదేమో అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాతో ఈమె గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

1 /8

అనన్య నాగళ్ల.. తెలుగులో  చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథతో తెరకెక్కిన  మూవీతో కథానాయికగా పరిచయం అయింది.

2 /8

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్‌'లో లీడ్ రోల్‌తో మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్ని సినిమాల్లో రానీ గుర్తింపు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్‌ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 /8

అనన్య నాగళ్ల కేవలం హీరోయిన్‌ పాత్రల కోసం ఎదురు చూడకుండా.. క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది.

4 /8

నితిన్ మేస్ట్రోతో పాటు సమంత శాకుంతలం సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ చేసినా.. అనన్యకు పెద్దగా యూజ్ కాలేదనే చెప్పాలి.

5 /8

అనన్య నాగళ్ల తెలంగాణ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఈమె జన్మస్థలం. అంతేకాదు ఇబ్రహీం పట్నానికి చెందిన రాజా మహేంద్ర కాలేజీలో ఇంజినీరింగ్  చదివింది. ఈమె ఆగష్టు 1న జన్మించింది. వికీపీడియాలో మాత్రం 8 జనవరి 1996 అని ఉంది.

6 /8

సినిమాల్లో రాకముందు ఈమె ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇన్ఫోసిస్‌లో కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ తో తో ఉద్యోగానికి రాజీనామా చేసింది.

7 /8

అనన్య నాగళ్ల కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసింది. అందులో ఈమె నటించిన 'షాదీ' అనే షార్ట్ సినిమాలో నటనకు సైమా అవార్డ్‌కు నామినేట్ అయింది.

8 /8

అనన్య..ఈ యేడాది  ‘తంత్ర ’మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ  మోస్తరు విజయం సాధించింది. రీసెంట్ గా నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ మూవీతో పలకరించింది.